عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ:
فَرَضَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ زَكَاةَ الفِطْرِ صَاعًا مِنْ تَمْرٍ، أَوْ صَاعًا مِنْ شَعِيرٍ، عَلَى العَبْدِ وَالحُرِّ، وَالذَّكَرِ وَالأُنْثَى، وَالصَّغِيرِ وَالكَبِيرِ مِنَ المُسْلِمِينَ، وَأَمَرَ بِهَا أَنْ تُؤَدَّى قَبْلَ خُرُوجِ النَّاسِ إِلَى الصَّلاَةِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1503]
المزيــد ...
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలలో బానిసపై మరియు స్వతంత్ర వ్యక్తిపై, పురుషులపై మరియు స్త్రీలపై, చిన్నవారిపై మరియు పెద్దవారిపై మొత్తం అందరిపై ఒక సాఅ ఖర్జూరాలు లేదా ఒక సాఅ బార్లీ జకాతుల్-ఫితర్ దానం చెల్లింపును విధిగావించారు. ప్రజలు ఈద్ నమాజుకు వెళ్ళే ముందే దానిని చెల్లించాలని ఆయన ఆదేశించారు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1503]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ తర్వాత వెంటనే జకాతుల్ ఫితర్ దానం చెల్లింపును తప్పనిసరి చేశారు.దీని పరిమాణం ఒక "సాఅ (దాదాపు 2.75 కిలోగ్రాములు)", ఇది బరువులో నాలుగు "ముద్ లకు (దాదాపు 0.6875 గ్రాములు)" సమానం. ఒక ముద్ద్ అంటే సగటు వ్యక్తి రెండు దోసేళ్ళ పరిమాణం (ఖర్జూరాలు లేదా యవలు). ప్రతి ముస్లిం—స్వతంత్రుడైనా, బానిస అయినా, పురుషుడైనా, స్త్రీయైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా — ఇది తప్పక దానం చేయాలి. ఇది తన అవసరాలకు మించి, తన కుటుంబ సభ్యులకు ఆ దినము మరియు రాత్రి అవసరాలకు మించి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రజలు ఈద్ నమాజ్‌కు వెళ్లే ముందే జకాతుల్-ఫిత్ర్ దానం చెల్లించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు.