+ -

عن أبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَحِلُّ لِامْرَأَةٍ مُسْلِمَةٍ تُسَافِرُ مَسِيرَةَ لَيْلَةٍ إِلَّا وَمَعَهَا رَجُلٌ ذُو حُرْمَةٍ مِنْهَا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1339]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
ఒక ముస్లిం మహిళకు, మహ్రమ్ (భర్త లేదా వివాహం చేయరాని సన్నిహిత బంధువు) అయిన పురుషుడు తోడుగా లేకుండా, ఒక రాత్రి ప్రయాణ దూరం ప్రయాణించడం అనుమతించబడలేదు.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1339]

వివరణ

ఒక ముస్లిం మహిళ కొరకు, తన మహ్రమ్ (వివాహం చేయరాని సన్నిహిత బంధువు) అయిన పురుషుడు తోడుగా లేకుండా, ఒక రాత్రి ప్రయాణ దూరం ప్రయాణించడం అనుమతించబడలేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా తెలిపినారు.

من فوائد الحديث

  1. ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) అన్నారు: మహ్రమ్ లేకుండా ఒక మహిళ ప్రయాణించడం అనుమతించబడలేదు. ఈ విషయంపై (హజ్, ఉమ్రా, మరియు షిర్క్ భూమిని విడిచిపెట్టి హిజ్రత్ చేసే సందర్భాలను తప్ప) ఉలమాల ఉమ్మడి అభిప్రాయం ఉంది. అయితే, హజ్ చేయడానికీ మహ్రమ్ అవసరమేనని కొంతమంది పండితులు షరతుగా పెట్టారు.
  2. ఇది ఇస్లామీయ షరీఅహ్ యొక్క పరిపూర్ణత మరియు మహిళల రక్షణ, భద్రత కోసం చూపిన ప్రత్యేక శ్రద్ధను సూచిస్తున్నది.
  3. అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించడం అంటే, అల్లాహ్ విధించిన ధర్మానికి పూర్తిగా లోబడి ఉండటం, ఆయన నిర్ణయించిన హద్దులను గౌరవించి పాటించడం అవసరం.
  4. ఒక మహిళకు మహ్రమ్ అంటే, ఆమె భర్త లేదా రక్త సంబంధం, పాలిచ్చిన బంధం, లేదా వివాహ సంబంధం వల్ల శాశ్వతంగా వివాహం చేయరాని బంధువులు. మహ్రమ్ అయిన వ్యక్తి తప్పని సరిగా ముస్లిం, పెద్దవాడు, బుద్ధిమంతుడు, నమ్మకస్తుడు, విశ్వసనీయమైనవాడు అయి ఉండాలి. ఎందుకంటే మహ్రమ్ తోడు ఉద్దేశ్యం మహిళను రక్షించడం, భద్రత కల్పించడం, ఆమె అవసరాలను చూసుకోవడం.
  5. బైహఖీ (రహిమహుల్లాహ్) మహిళ ప్రయాణానికి సంబంధించిన హదీథుల గురించి ఇలా అన్నారు: ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే: "ప్రయాణం అని పిలవబడే ఏదైనా దూరాన్ని, ఆమె భర్త లేదా మహ్రమ్ లేకుండా ఒక మహిళ చేయడం నిషిద్ధం. ఇది మూడు రోజులు, రెండు రోజులు, ఒక రోజు, బరీద్ (ప్రత్యేక దూర ప్రమాణం) అయినా, లేదా మరేదైనా అయినా సరే - సహీహ్ ముస్లింలో చివరిగా వచ్చిన ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) హదీథు 'ఒక మహిళ తన మహ్రమ్ లేకుండా ప్రయాణించకూడదు.' యొక్క సాధారణ అర్థాన్ని బట్టి ప్రయాణం అని పిలవబడే ప్రతిదానికీ వర్తిస్తుంది." ఈ హదీథు ప్రశ్న అడిగినవారి పరిస్థితి, వారి దేశ పరిస్థితిని బట్టి చెప్పబడింది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా