+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ نَسِيَ وَهُوَ صَائِمٌ، فَأَكَلَ أَوْ شَرِبَ، فَلْيُتِمَّ صَوْمَهُ، فَإِنَّمَا أَطْعَمَهُ اللهُ وَسَقَاهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1155]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహ వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతను తన ఉపవాసాన్ని పూర్తిగా కొనసాగించాలి. ఎందుకంటే అతనికి ఆహారం, పానీయం ఇచ్చింది స్వయంగా అల్లాహ్ యే."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1155]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేసినారు: ఎవరైనా ఉపవాసం (ఫర్జ్ అయినా, నఫిల్ అయినా) లో ఉండగా మర్చిపోయి తినినా లేదా తాగినా సరే, అతను తన ఉపవాసాన్ని కొనసాగించాలి; ఉపవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అతను ఉపవాసాన్ని ఉల్లంఘించాలనే ఉద్దేశంతో తినలేదు. ఇది అల్లాహ్ నుండి వచ్చిన దీవెన; అతనికి తినిపించినది, త్రాపించినది స్వయంగా అల్లాహ్ యే.

من فوائد الحديث

  1. ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతని ఉపవాసం చెల్లుబాటు అవుతుంది (ఉపవాసం భంగం కాదు).
  2. ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతనిపై ఎలాంటి పాపం లేదు, ఎందుకంటే ఇది అతని ఇష్టంతో జరిగినది కాదు.
  3. అల్లాహ్ తన దాసులపై చూపించే దయలో ఆయన వారికి సౌలభ్యం కల్పించడం, వారి కష్టాన్ని తొలగించడం కూడా ఉన్నది.
  4. ఒకవేళ ఉపవాసాన్ని భంగం చేసే పనులు చేస్తే, మూడు షరతులు (పరిస్థితులు) నెరవేరినప్పుడు మాత్రమే ఆ ఉపవాసం భంగమవుతుంది: ఉపవాసాన్ని భంగం చేసే పని (తినడం, తాగడం, మొదలైనవి) తెలియక చేస్తే—అంటే, తెలియక తిన్నా లేదా తాగినా—ఉపవాసం భంగం కాదు; మర్చిపోయి తిన్నా లేదా తాగినా, ఉపవాసం చెల్లుబాటు అవుతుంది; తిరిగి ఆ రోజు ఉపవాసం పాటించవలసిన అవసరం లేదు; ఎవరి ఒత్తిడీ లేదా బలవంతం లేకుండా, స్వయంగా తన ఇష్టంతో ఉపవాసంలో తినకూడదని, తాగకూడదని తెలిసినా, ఒకవేళ కావాలని తినడం లేదా తాగడం వంటివి చేసినప్పుడు మాత్రమే ఉపవాసం భంగమవుతుంది. ఎవరైనా అతనిపై బలవంతం చేసి అతనిచే తినిపించినా, త్రాపించినా, ఉపవాసం భంగం కాదు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా