عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا فَلْيَصُمْهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1082]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1082]
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించడాన్ని నిషేధించారు (రమదాన్ మొదటి రోజు ఉపవాసం తప్పి పోకుండా ముందు జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో). ఎందుకంటే రమదాన్ నెల ఉపవాసాల ఆరంభం ఖుర్ఆన్ ఆజ్ఞ ప్రకారం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంది, కాబట్టి అనవసరంగా ముందస్తు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు.