عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمنينَ رَضِيَ اللَّهُ عَنْهَا زَوْجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَعْتَكِفُ العَشْرَ الأَوَاخِرَ مِنْ رَمَضَانَ، حَتَّى تَوَفَّاهُ اللَّهُ، ثُمَّ اعْتَكَفَ أَزْوَاجُهُ مِنْ بَعْدِهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2026]
المزيــد ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో చివరి పది రోజులు ఇతికాఫ్ (మస్జిద్‌లో ఏకాంతంగా గడపడం) చేసేవారు. ఆయన మరణం వరకు ఈ సున్నతును తప్పకుండా పాటించారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్యలు కూడా ఇదే విధంగా ఇతికాఫ్ కొనసాగించినారు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2026]
ముస్లిం సమాజానికి మాతృమూర్తి అయిన ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా పలికినారు: 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, రమదాన్ చివరి పది రోజుల్లో ఇతికాఫ్ (మసీదులో ఏకాంతంగా ప్రత్యేక ధ్యాన నివాసం) పాటించేవారు. ఇది లైలతుల్ ఖద్ర్ (విధివ్రాత నిర్ణయం జరిగే అత్యంత గొప్ప రాత్రి) కోసం అన్వేషణగా ఉండేది. ఆయన ఈ సున్నతును మరణం వరకు కొనసాగించారు. ఆయన తర్వాత ఆయన భార్యలు (రదియల్లాహు అన్హున్నా) కూడా ఇతికాఫ్ ను కొనసాగించినారు'.