عَنْ أَبِي حُمَيْدٍ السَّاعِدِيِّ رَضيَ اللهُ عنه قَالَ:
اسْتَعْمَلَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلًا عَلَى صَدَقَاتِ بَنِي سُلَيْمٍ، يُدْعَى ابْنَ اللُّتْبِيَّةِ، فَلَمَّا جَاءَ حَاسَبَهُ، قَالَ: هَذَا مَالُكُمْ وَهَذَا هَدِيَّةٌ. فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «فَهَلَّا جَلَسْتَ فِي بَيْتِ أَبِيكَ وَأُمِّكَ، حَتَّى تَأْتِيَكَ هَدِيَّتُكَ إِنْ كُنْتَ صَادِقًا» ثُمَّ خَطَبَنَا، فَحَمِدَ اللَّهَ وَأَثْنَى عَلَيْهِ، ثُمَّ قَالَ: «أَمَّا بَعْدُ، فَإِنِّي أَسْتَعْمِلُ الرَّجُلَ مِنْكُمْ عَلَى العَمَلِ مِمَّا وَلَّانِي اللَّهُ، فَيَأْتِي فَيَقُولُ: هَذَا مَالُكُمْ وَهَذَا هَدِيَّةٌ أُهْدِيَتْ لِي، أَفَلاَ جَلَسَ فِي بَيْتِ أَبِيهِ وَأُمِّهِ حَتَّى تَأْتِيَهُ هَدِيَّتُهُ، وَاللَّهِ لاَ يَأْخُذُ أَحَدٌ مِنْكُمْ شَيْئًا بِغَيْرِ حَقِّهِ إِلَّا لَقِيَ اللَّهَ يَحْمِلُهُ يَوْمَ القِيَامَةِ، فَلَأَعْرِفَنَّ أَحَدًا مِنْكُمْ لَقِيَ اللَّهَ يَحْمِلُ بَعِيرًا لَهُ رُغَاءٌ، أَوْ بَقَرَةً لَهَا خُوَارٌ، أَوْ شَاةً تَيْعَرُ» ثُمَّ رَفَعَ يَدَهُ حَتَّى رُئِيَ بَيَاضُ إِبْطِهِ، يَقُولُ: «اللَّهُمَّ هَلْ بَلَّغْتُ» بَصْرَ عَيْنِي وَسَمْعَ أُذُنِي.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6979]
المزيــد ...
అబూ హుమైద్ అస్సాయిదీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బనీ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేయడానికి ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని నియమించారు. అతను తిరిగి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని లెక్క అడిగారు. అతను, 'ఇది మీ జకాత్ సంపద, మరియు ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది' అని అన్నాడు. దానిపై, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు "నీవు చెబుతున్నది నిజమే అయితే, నీకు బహుమతులు వచ్చే వరకు నువ్వు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు ఉండలేదు?" తరువాత ప్రవక్త మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించినారు, అల్లాహ్‌ను స్తుతించి, ఆయనను కీర్తించిన తర్వాత, ఆయన ఇలా అన్నారు: "అమ్మా బా'దు", అల్లాహ్ నా ఆధీనంలో ఉంచిన దానిలో కొంత పనిని నిర్వహించడానికి నిశ్చయంగా నేను మీలో ఒక వ్యక్తిని నియమిస్తాను, ఆపై అతను నా వద్దకు వచ్చి ఇలా అంటాడు “ఇది మీ (జకాతు) సంపద మరియు ఇది బహుమతి, బహుమతిగా నాకు ఇవ్వబడింది”. మరి అతనికి (ఎవరైనా) బహుమతులు ఇస్తారా లేదా అని చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు (నిరీక్షించి) ఉండలేదు? అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను), మీలో ఎవరైనా చట్టవిరుద్ధంగా ఏదైనా తీసున్నట్లయితే, దానిని మోసుకుంటూ పునరుత్థాన దినమున అల్లాహ్‌ను కలుస్తారు. మీలో ఎవరూ అల్లాహ్‌ను కలుసుకోవడానికి వెళ్ళినపుడు, రంకెలు పెడుతున్న ఒంటెను, అరుస్తూ ఉండే ఆవును లేదా ‘బేబే’ అని అరుస్తున్న గొర్రెను మోసుకెళ్లడం నేను చూడదల్చుకోలేదు." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను తన చంకల తెల్లదనం కనిపించే వరకు పైకెత్తి, "ఓ అల్లాహ్! నేను (నీ సందేశాన్ని) అందజేయలేదా?" అని అన్నారు. ఉల్లేఖకుడైన అబూ హుమైద్ అస్సాయిదీ ఇంకా ఇలా అన్నారు: “నా కళ్ళు చూశాయి మరియు (ఆ హదీథును) నా చెవులు విన్నాయి.”
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 6979]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని బనూ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేసి తీసుకు రావడానికి నియమించినారు. పని ముగించుకుని అతడు మదీనాకు తిరిగి వచ్చినపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఎంత జకాతును వసూలు చేసినాడు మరియు అందులో అతడు (తన రోజువారి ఖర్చుల కొరకు) ఎంత ఖర్చు పెట్టినాడు అని లెక్క అడుగగా, ఇబ్న్ లుతబియ్యహ్ ఇలా అన్నాడు: “ఇది (బనూ సులైమ్ తెగ వారి నుండి) నేను జకాతుగా వసూలు చేసిన మీ సంపద మరియు (అది గాక నా దగ్గరున్న) ఈ సంపద నాకు బహుమతిగా ఇవ్వబడింది.” అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: నీవు సత్యవంతునివే అయితే, నీకు ప్రజలు బహుమతులు ఇస్తారో లేదో చూడటానికి నీవు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోవు? ఆ సంపద నీకు బహుమతిగా రావడానికి కారణం నీకు అప్పగించబడిన బాధ్యతలు మరియు విధులే. నీవు నీ ఇంట్లోనే కూర్చొని ఉండి ఉంటే, నీకు ఏమీ బహుమతిగా ఇవ్వబడేది కాదు. కనుక, కేవలం అది బహుమతి రూపంలో నీకు చేరింది అనే కారణంగా నీవు దానిని చట్టబద్ధంగా పరిగణించడానికి అనుమతి లేదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపంగా ఉన్నప్పటికీ వేదిక (మెంబరు) పైకి ఎక్కి ప్రసంగించినారు. ముందుగా అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు కృతఙ్ఞతలు అర్పించి ఇలా అన్నారు: “అమ్మా బ’ద్! నిశ్చయంగా అల్లాహ్ నాకు అప్పగించిన బాధ్యతలలో జకాతు వసూలు మరియు యుద్ధములో జయించిన సంపద విషయములలో ఒకరిని దాని కొరకు నియమించాను. అతడు ఆ పని నుండి తిరిగి వచ్చి ఇలా అంటాడు: “ఇది మీ కొరకు, మరియు ఇది నా బహుమతి. బహుమతిగా నాకు ఇవ్వబడింది” అని. “తన బహుమతి తనకు వస్తుందో లేదో చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోడు? అల్లాహ్ సాక్షిగా, తీర్పు దినమున తన మెడపై మోసుకుంటూ అల్లాహ్‌ను కలుసుకోవడం తప్ప ఎవరూ తనకు ఇచ్చిన దాని నుండి చట్టవిరుద్ధంగా ఏమీ తీసుకోరు - అది మూలుగుతూ ఉండే ఒంటె అయినా, మూలుగుతూ ఉండే ఆవు అయినా, లేదా అరచే గొర్రె అయినా. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, బలంగా తన రెండు చేతులను పైకెత్తినారు, అక్కడ కూర్చున్న వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చంకలలోని తెల్లదనాన్ని చూడగలిగినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పైకెత్తి ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నేను నీ తీర్పును వారికి అందజేసినాను.” ఈ హదీథు ఉల్లేఖకుడైన అబుయ్ హుమైద్ అస్సాదీ (రదియల్లాహు అన్హు) ఇది (ఈ హదీథు) తన కనులు చూసినది మరియు తన చెవులు విన్నది అని తెలియజేసినారు.