عن عبد الله بن عمرو رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«لَيْسَ الْوَاصِلُ بِالْمُكَافِئِ، وَلَكِنِ الْوَاصِلُ الَّذِي إِذَا قُطِعَتْ رَحِمُهُ وَصَلَهَا».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5991]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 5991]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియ జేస్తున్నారు: బంధువులతో బంధుత్వపు సంబంధాలను కొనసాగించడంలో మరియు వారితో దయ, కరుణా గుణాలతో వ్యవరించడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, వారు తనకు చేసిన ఉపకారానికి బదులుగా అటువంటి ఉపకారమే చేసే వాడు కాదు. వాస్తవానికి బంధుత్వపు బంధాలను జోడించి ఉంచడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, తనతో బంధుత్వాన్ని తెంచుకున్నా, తిరిగి దానిని జోడించేవాడు. వారు తనతో అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించినా సరే, వారిని దయతో, వాత్సల్యములతో కలిసే వాడు.