عَنِ ابْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَقِيتُ إِبْرَاهِيمَ لَيْلَةَ أُسْرِيَ بِي فَقَالَ: يَا مُحَمَّدُ، أَقْرِئْ أُمَّتَكَ مِنِّي السَّلاَمَ، وَأَخْبِرْهُمْ أَنَّ الجَنَّةَ طَيِّبَةُ التُّرْبَةِ عَذْبَةُ الْمَاءِ، وَأَنَّهَا قِيعَانٌ، وَأَنَّ غِرَاسَهَا سُبْحَانَ اللهِ وَالحَمْدُ لِلَّهِ وَلاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَاللَّهُ أَكْبَرُ».
[حسن بشواهده] - [رواه الترمذي] - [سنن الترمذي: 3462]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“ఇస్రా (మేరాజ్) యాత్ర జరిగిన రాత్రి నేనుఇబ్రాహీం (అలైహిస్సలాం) ను కలిసాను. ఆయన ఇలా అన్నారు “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! నీ ఉమ్మత్’కు నా సలాం తెలియజేయి, వారికి తెలియజేయి స్వర్గములో స్వచ్ఛమైన నేల మరియు మధురమైన నీరు ఉన్నాయి. అది ఒక విశాలమైన మైదానం, మరియు దాని మొలకలు “సుబ్’హానల్లాహి” (అల్లాహ్ పరమ పవిత్రుడు); మరియు “వల్’హందులిల్లాహి” (సర్వస్తోత్రములు, ప్రశంసలు, పొగడ్తలు, కృతజ్ఞతలు అన్నీ అల్లాహ్’కే చెందుతాయి); మరియు “వ లా ఇలాహ ఇల్లల్లాహు” (అల్లాహ్ తప్ప వేరే ఇతర నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు “వల్లాహు అక్బర్” (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు)”.
- [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 3462]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మరియు మే’రాజ్ యాత్ర జరిగిన రాత్రి అల్లాహ్ మిత్రుడైన ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను కలిశానని, మరియు ఆయన తనతో ఇలా అన్నారు అని తెలియజేస్తున్నారు: “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ సమాజానికి నా శుభాకాంక్షలు తెలియజేయండి, మరియు స్వర్గములో మనోహరమైన నేల, అసలే మాత్రమూ ఉప్పదనం లేని మధురమైన నీరు ఉన్నాయని, స్వర్గం సువిశాలమైనదని, చదునైనదని, మరియు వృక్షాలు లేనిదని వారికి చెప్పండి. దాని మొలకలు మంచి మాటలు, అవి శాశ్వతమైన ధర్మకార్యాలు: అవి ““సుబ్’హానల్లాహి” (అల్లాహ్ పరమ పవిత్రుడు); మరియు “వల్’హందులిల్లాహి” (సర్వస్తోత్రములు, ప్రశంసలు, పొగడ్తలు, కృతజ్ఞతలు అన్నీ అల్లాహ్’కే చెందుతాయి); మరియు “వ లా ఇలాహ ఇల్లల్లాహు” (అల్లాహ్ తప్ప వేరే ఇతర నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు “వల్లాహు అక్బర్” (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు)” అని తెలియజేయండి. మరియు ఒక ముస్లిం ఆ పదాలను పలికి, పునరావృతం చేసినప్పుడల్లా, అతని కోసం స్వర్గంలో ఒక మొక్క నాటబడుతుంది.”