عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ سمعتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يقولُ:
«أَلاَ إِنَّ الدُّنْيَا مَلْعُونَةٌ، مَلْعُونٌ مَا فِيهَا، إِلاَّ ذِكْرُ اللهِ وَمَا وَالاَهُ وَعَالِمٌ أَوْ مُتَعَلِّمٌ».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2322]
المزيــد ...
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“చూడండి, నిశ్చయంగా ఈ ప్రపంచం శపించబడింది, మరియు దానిలో ఉన్న ప్రతిదీ కూడా; కేవలం అల్లాహ్ స్మరణ, మరియు దానికి అనుగుణంగా ఉన్నది; ఒక పండితుడు మరియు ఙ్ఞానసముపార్జన చేయు వాడు (విద్యార్థి) తప్ప.”
[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 2322]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: “ఈ ప్రపంచాన్ని మరియు దానిలోని ప్రతిదానిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు; నిందార్హమైనదిగా భావిస్తాడు; విడిచి పెట్టదగినదిగా, దూరంగా ఉంచదగినదిగా భావిస్తాడు; అందులో ఉన్న ప్రతిదీ విడిచి పెట్టదగినది మరియు ఎంతమాత్రమూ ప్రసంసార్హమైనది కాదు. ఎందుకంటే ప్రపంచం మరియు దానిలోని ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి దృష్టి మరల్చి, ఆయన నుండి దూరం చేస్తుంది; అయితే అల్లాహ్ స్మరణ మరియు దానికి అనుగుణంగా ఉండే మరియు దానిని పోలి ఉండే, మరియు అల్లాహ్ ఇష్టపడేవి లేదా ప్రజలకు బోధించే మతపరమైన జ్ఞానంలో ప్రావీణ్యం ఉన్న పండితుడు, లేదా అలాంటి జ్ఞానాన్ని కోరుకునే జ్ఞాన అన్వేషకుడు తప్ప.