+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَت:
دَخَلَتْ هِنْدٌ بِنْتُ عُتْبَةَ امْرَأَةُ أَبِي سُفْيَانَ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَتْ: يَا رَسُولَ اللهِ، إِنَّ أَبَا سُفْيَانَ رَجُلٌ شَحِيحٌ، لَا يُعْطِينِي مِنَ النَّفَقَةِ مَا يَكْفِينِي وَيَكْفِي بَنِيَّ إِلَّا مَا أَخَذْتُ مِنْ مَالِهِ بِغَيْرِ عِلْمِهِ، فَهَلْ عَلَيَّ فِي ذَلِكَ مِنْ جُنَاحٍ؟ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «خُذِي مِنْ مَالِهِ بِالْمَعْرُوفِ مَا يَكْفِيكِ وَيَكْفِي بَنِيكِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1714]
المزيــد ...

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం:
“అబూ సూఫ్యాన్ (రదియల్లాహు అన్హు) భార్య అయిన హింద్ బింత్ ఉత్బాహ్ (రదియల్లాహు అన్హా) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఇలా అన్నది: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! (నా భర్త) అబూ సూఫ్యాన్, నిశ్చయంగా ఒక పిసినారి. అతను నాకు మరియు నా పిల్లల ఖర్చులకు తగినంత జీవనోపాధి (పైకాన్ని) ఇవ్వడు, అతనికి తెలియకుండా నేను అతని ధనము నుండి తీసుకునేది తప్ప. అలా చేయడంలో నాపై ఏదైనా దోషం ఉందా?” దానికి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “"అతని ధనము నుండి నీకు సరిపోయే మరియు మీ పిల్లలకు సముచితమైన రీతిలో సరిపోయేటంత తీసుకో."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1714]

వివరణ

హింద్ బిన్తె ఉత్బా (రదియల్లాహు అన్హా) తన భర్త అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడిగారు; ఆమె ప్రవక్త (స) కు అతని గురించి వివరించినారు - అతనొక పిసినారి అని, తన సంపదను ఎంతో ప్రేమిస్తాడని, తనకు, తన పిల్లల ఖర్చులకు తగినంత ధనం ఎప్పుడూ ఇచ్చేవాడు కాడని, అతనికి తెలియకుండా అతని ధనము లోనుండి కొంత తీసుకుంటే తప్ప తమ ఖర్చులు తీరేవి కావని. అలా చేయడంలో తనపై ఏమైనా పాపము ఉంటుందా అని. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా జవాబిచ్చారు, "అతని సంపద నుండి నీకు మరియు నీ పిల్లలకు సాధారణంగా సరిపోతుందని భావించే మొత్తాన్ని తీసుకోండి, అతనికి తెలియకుండానే కూడా."

من فوائد الحديث

  1. భార్యా పిల్లల పోషణ భర్తపై విధి చేయబడినది.
  2. ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “అతని ధనము నుండి నీకు సరిపోయేది సహేతుకమైన రీతిలో తీసుకో” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్న మాటలకు అర్థం ఏమిటంటే; షరియత్ లో స్పష్టమైన ఆదేశాలు, సూచనలు లేని విషయాలలో ఆయన సల్లల్లాహు అలైహి వస ఆమెని ఆ సమాజములో సమాజం లో సాధారణంగా ఆచరించే పధ్ధతిని (సంస్కృతిని) అనుసరించమని సూచించినారు.
  3. ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఎవరి గురించైనా వారి పరోక్షములో, వారు ఇష్టపడని విధంగా ప్రస్తావించడం (చాడీలు చెప్పడం) నిషేధం. అయితే వారి గురించి ప్రశ్నించడం, లేదా వారిని గురించి ఫిర్యాదు చేయడం లేదా ఇలాంటి సందర్భాలలో – వారు ఇష్టపడని విధంగా వారి పరోక్షములో ప్రస్తావించవచ్చు అనడానికి ఈ హదీథు ఒక ఋజువు. ఇది వ్యక్తుల పరోక్షములో వారు ఇష్టపడని విధంగా వారిని గురించి ప్రస్తావించడానికి అనుమతి ఉన్న సందర్భాలలో ఒకటి.
  4. ఇమాం అల్ ఖుర్తుబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “అబూ సూఫ్యాన్ (రదియల్లాహు అన్హు) తన అన్ని వ్యవహారాలలో పిసినారిగా వ్యవహరిస్తాడు అని వర్ణించడం హింద్ (రదియల్లాహు అన్హా) ఉద్దేశ్యం కాదు. నిజానికి ఆమె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో తన పరిస్థితిని వివరించింది – తన భర్త తనతో మరియు తన పిల్లలతో పిసినారిగా వ్యవహరిస్తాడు అని. ఇలా చెప్పడం మొత్తంగా ప్రతి వ్యవహారం లోనూ అతని పిసినారితనాన్ని సూచించదు. ఎందుకంటే చాలా మంది నాయకులు తమ కుటుంబాలతో ఇలానే ఉంటారు. వారు తమ సొంత కుటుంబం కంటే, ఇతరుల అభిమానాన్ని పొందేందుకు ఇష్టపడతారు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి