عَنْ سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«رِبَاطُ يَوْمٍ فِي سَبِيلِ اللَّهِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا عَلَيْهَا، وَمَوْضِعُ سَوْطِ أَحَدِكُمْ مِنَ الجَنَّةِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا عَلَيْهَا، وَالرَّوْحَةُ يَرُوحُهَا العَبْدُ فِي سَبِيلِ اللَّهِ أَوِ الغَدْوَةُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا عَلَيْهَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2892]
المزيــد ...
సహ్ల్ ఇబ్నె సా’ద్ అస్’సాయిదీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే శుభప్రదమైనది; , మరియు స్వర్గములో, మీలో ఎవరి వద్దనైనా ఉన్న చిన్న కొరడాతో ఆక్రమించ దగినంత చిన్న స్థలమైనా ఈ ప్రపంచం కంటే మరియు దాని ఉపరితలంపై ఉన్న దాని ప్రతిదాని కన్నా ఉత్తమమైనది; మరియు అల్లాహ్ యొక్క దాసుడు, ఒక ఉదయం లేదా ఒక సాయంత్రం అల్లాహ్ మార్గములో చేసే ప్రయాణం ఈ ప్రపంచం మరియు దాని ఉపరితలంపై ఉన్న ప్రతి దాని కంటే ఉత్తమమైనది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2892]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ముస్లింలకు మరియు అవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రదేశంలో అల్లాహ్ కొరకు నిజాయితీగా ఒక రోజు ముస్లింలను వారి నుండి కాపాడటం ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; అలాగే అల్లాహ్ మార్గంలో పోరాడటానికి ఉపయోగించే కొరడా, స్వర్గం లో ఎంత స్థలమైతే ఆక్రమించగలదో, అది ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; మరియు దినము ప్రారంభం నుండి మధ్యాహ్నం ముందు వరకు లేదా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అల్లాహ్ మార్గంలో ఒక్కసారి నడిచినట్లైతే అందుకు లభించే ప్రతిఫలం మరియు బహుమానం ఈ ప్రపంచం మరియు దానిలోని ప్రతిదానికంటే ఉత్తమమైనది.