+ -

عَنْ أَبِي مُوسَى رضي الله عنه قَالَ:
سُئِلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الرَّجُلِ يُقَاتِلُ شَجَاعَةً، وَيُقَاتِلُ حَمِيَّةً، وَيُقَاتِلُ رِيَاءً، أَيُّ ذَلِكَ فِي سَبِيلِ اللهِ؟ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ قَاتَلَ لِتَكُونَ كَلِمَةُ اللهِ هِيَ الْعُلْيَا، فَهُوَ فِي سَبِيلِ اللهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1904]
المزيــد ...

అబూ మూసా అల్ అషఅరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “శౌర్యపరాక్రమాలతో పోరాడేవాడు, జాత్యభిమానము తో పోరాడేవాడు మరియు ప్రదర్శనాబుధ్ధితో పోరాడేవాడు – వీరిలో ఎవరు అల్లాహ్ మార్గములో ఉన్నవాడు?’ అని ప్రశ్నించడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయడానికి పోరాడుతాడో అతడు అల్లాహ్ యొక్క మార్గములో ఉన్నవాడు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1904]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను యోధుల విభిన్న లక్ష్యాలకు సంబంధించి ప్రశ్నించడం జరిగింది – (ప్రజల ముందు) శౌర్యపరాక్రమాలు గలవానిగా పోరాడేవాడు, తన జాతి జనుల కొరకు ఉన్మాదిలాగా పోరాడే వాడు, మరియు ప్రజల దృష్ఠిలో అల్లాహ్ మార్గములో పోరాడేవానిగా గుర్తింపు పొందుటకు లేక అటువంటి ఇతర విషయాన్ని ఆశించి పోరాడే వాడు – వీరిలో ఎవరు అల్లాహ్ మార్గములో ఉన్నవాడు? అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – “అల్లాహ్ మార్గములో పోరాడే యోధుడు ఎవరంటే: ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయుటకు పోరాడుతాడో అతడు” అని తెలియజేసారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية Малагашӣ Урумӣ Канада الولوف
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఆచరణల శ్రేష్ఠత్వము లేక అధమత్వములకు మూలము కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే అనే సంకల్పము మరియు కల్మషము లేనితనమూను.
  2. సంకల్పము అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయుట అయిఉండి, దానికి అదనంగా షరియత్ కు అనుగుణమైన మరొక సంకల్పము కూడా జత కలిస్తే, అది ప్రథమంగా ఉన్న అసలు సంకల్పానికి హాని కలిగించదు. ఉదాహరణకు: అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేసే సంకల్పముతో పాటు యుద్ధఫలాలను పొందుట అనే సంకల్పము కూడా కలిగి ఉండుట.
  3. మాతృభూమిని, పవిత్ర స్థలాలను శతృవులనుండి రక్షించుట కొరకు పోరాడుట అల్లాహ్ మార్గములో పోరాడుటగానే పరిగణించబడుతుంది.
  4. ఇందులో ‘ముజాహిదీన్’ల గురించి ప్రస్తావించబడిన ఘనత, ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నత స్థాయిలో ఉంచుటకు గానూ పోరాడుతారో వారికి మాత్రమే ప్రత్యేకమైనది.