عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللَّهَ تَجَاوَزَ عَنْ أُمَّتِي مَا حَدَّثَتْ بِهِ أَنْفُسَهَا، مَا لَمْ تَعْمَلْ أَوْ تَتَكَلَّمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5269]
المزيــد ...
అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5269]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం, ఒకవేళ తన మసులో చెడు ఆలోచనలు ఉన్నట్లైతే, అతడు వాటిపై అమలు చేయనంత వరకు లేదా వాటి గురించి బయటకు మాట్లాడనంత వరకు – అతడు అటువంటి చెడు ఆలోచనలు కలిగి ఉన్నందుకు బాధ్యుడుగా చేయబడడు, అల్లాహ్ అతని పై నుంచి ఆ భారాన్ని తొలిగించి అతణ్ణి క్షమించాడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి హృదయాలలో ఉన్న దానికి (అది చెడు ఆలోచన అయినా) అల్లాహ్ వారిని బాధ్యులను చేయలేదు; వారి హృదయాలలో ఉన్నది వారి ఆత్మలలో పునరావృతం అవుతూ ఉన్నా, అది అక్కడ స్థిరపడకుండా ఉన్నట్లైతే. ఒకవేళ అది అతని హృదయంలో స్థిరపడిపోయినట్లైతే, ఉదాహరణకు: గర్వము, అహంభావము, మోసము; కపటత్వము మొదలైనవి అక్కడ స్థిరపడిపోతే అప్పుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు; లేక అతడు తన అవయవాలతో ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టినా; లేక అతడు తన నాలుకతో వాటిని ఉచ్ఛరించినా – అపుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు.