عن عبد الله بن مسعود رضي الله عنه قال: علمنا رسول الله صلى الله عليه وسلم خطبة الحاجة: إن الحمد لله، نستعينه ونستغفره، ونعوذ به من شرور أنفسنا، من يهد الله، فلا مضل له، ومن يضلل، فلا هادي له، وأشهد أن لا إله إلا الله، وأشهد أن محمدا عبده ورسوله، " يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ والأرحام إن الله كان عليكم رقيبا} [النساء: 1] ، {يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون} [آل عمران: 102] ، {يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا (70) يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما} [الأحزاب:70 - 71].
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه والنسائي وأحمد]
المزيــد ...

అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు “-మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మాకు ఖుత్బతుల్ హాజత్ నేర్పించారు,:ఇన్నల్ హాందలిల్లాహ్,నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహూ,వ నవూజు బిహీ మిన్ శురూరి అన్ఫుసినా’మన్ యహ్దిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్’లిల్ ఫలా హాదియలహూ’వ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసులుహూ’{సర్వ స్తోత్రాలు ప్రశంసలు కేవలం అల్లాహ్’కు మాత్రమే శోభిస్తాయి,ఆయనను మాత్రమే మేము ఆర్ధిస్తాము,మరియు ఆయనతో మాత్రమే క్షమాపణ ను కోరుకుంటాము,మా మనసుల కీడు నుంచి ఆయనతో మాత్రమే శరణు వేడుతున్నాము,అల్లాహ్ ఋజుమార్గం ప్రసాదించినవాడికి ఏ ఒక్కరూ మార్గబ్రష్ట పర్చలేరు,అల్లాహ్ మార్గబ్రష్ట పరిచిన వాడికి ఏ ఒక్కరూ ఋజుమార్గం నొసగలేరు,మరియు నేను ‘అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం మరొకరు లేరు అని సాక్ష్యామిస్తున్నాను,మరియు నేను’ ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు సందేశహరుడు అని సాక్ష్యామిస్తున్నాను}"يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ والأرحام إن الله كان عليكم رقيبا} [النساء: 1]మానవులారా!మిమ్మల్నిఒకే ప్రాణి నుంచి పుట్టించి,దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి,ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను,స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్కు భయపడండి.బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి.నిశ్చయంగా అల్లాహ్ మీ పై నిఘావేసి ఉన్నాడు' {يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون} [آل عمران: 102] ఓ విశ్వాసులారా!అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి.ముస్లింలుగా తప్ప మరణించకండి {يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا (70) يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما} [الأحزاب:70 - 71]-ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడండి.మాట్లాడితే సూటిగా మాట్లాడండి(సత్యమే పలకండి)తద్వారా అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు.మీ పాపాలను మన్నిస్తాడు.ఎవరయితే అల్లాహ్కు,ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు.
దృఢమైనది - దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు

వివరణ

ఇబ్ను మస్ఊద్ రదియల్లాహు అన్హు యొక్క హదీసు [-అల్లాహ్ ప్రశంసలు కీర్తించుటకు,అల్లాహ్ ను సహాయం అర్ధించుటకు,సమస్త కీడుల నుండి అల్లాహ్ వైపునకు మరలుటకు,ఈ శుభప్రదమైన ఆయతులు పఠించుటకు ఈ ‘విలువైన ఖుత్బ’ షరీఅతు బద్దంగా నిర్దారించబడింది,కాబట్టి ప్రజలకు పవిత్ర ఖురఆన్,హదీసులు మరియు ఫిఖా శాస్త్రమువంటి తదితర జ్ఞానాన్ని ప్రభోదించేటప్పుడు మరియు వారికి ఉపదేశించేటప్పుడు ఈ ఖుత్బా తో ప్రారంభించాలి,ఇది కేవలం వివాహం సందర్బం కొరకు మాత్రమే ప్రత్యేకము కాదు,ప్రతీ అవసరము లో దీని ని పఠించాలి తద్వారా బర్కతు సమృద్దిఫలాలు ప్రాప్తిస్తాయి,మరియు దాంతో ప్రారంభించడం వల్ల మంచిప్రభావం పడుతుంది,ఈ ఆచరణ ‘సున్నత్ ముఅక్ఖిదా’ కు చెందినది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నిశ్చయంగా అవసర సమయాల్లో ఈ ఖుత్బా ద్వారా ప్రారంభించడము ముస్తహబ్బ్ గా పరిగణించబడింది,ఎందుకంటే ఈ స్మరణ సమృద్ది ఫలాలను ప్రసాదిస్తుంది.
  2. ఖుత్బా {ప్రసంగం} ఖచ్చితంగా అల్లాహ్ స్తోత్రము, రెండు సాక్ష్యాలు మరియు కొన్ని పవిత్ర ఖుర్ఆన్ ఆయతులతో ఇమిడి ఉండాలి.
  3. ఈ హదీసు ఒక ఖుత్బా ప్రసంగము,దీనికి ఖుత్బతుల్ హాజా’గా పేర్కొంటారు, కాబట్టి ప్రజలకు పవిత్ర ఖుర్ఆన్,హదీసులు మరియు ఫిఖా శాస్త్రమువంటి తదితర జ్ఞానాన్ని ప్రభోదించేటప్పుడు మరియు వారికి ఉపదేశించేటప్పుడు ఈ ఖుత్బా తో ప్రారంభించాలి,ఇది కేవలం వివాహం సందర్బం కొరకు మాత్రమే ప్రత్యేకించబడలేదు,అవసరమైనప్పుడల్లా దీనిని ఆచరించాలి,వివాహము ఆ అవసరాలలో ఒకటి.
  4. ఈ హదీసులో స్తుతించదగ్గ గుణాలు అల్లాహ్ కొరకు దృవీకరించబడ్డాయి,వాటికి ఆయన యోగ్యుడని మరియు వాటితో కలగలిపియున్నట్లు నిరూపితపరుస్తుంది.
  5. ఈ హదీసు లో మహోన్నతుడైన అల్లాహ్ ను మాత్రమే సహాయం కోరడం,మనిషి ఎదుర్కునే అవసరాలలో సౌకర్యం సౌలభ్యాన్ని ఏర్పర్చడంలో,ముఖ్యంగా వివాహ ఖర్చుల విషయంలో'సౌలభ్యాన్నిఅర్ధించడం.
  6. ఈ హదీసులో గొప్పవాడైన అల్లాహ్ తో క్షమాపణను వేడుకోవడం మరియు పాపాలను మరియు లోపాలను కప్పిఉంచమని ప్రాదేయపడటం,లోపాలు మరియు తప్పిదాలను ఒప్పుకోవడం తద్వారా ఆయన వాటిని తుడిచి వేసి క్షమిస్తాడు.
  7. ఈ హదీసులో ‘అమ్మారా’ అనగా హరాము చేయమని,వాజిబు వదలమని ప్రోత్సాహించే మనసు కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు మరియు ఆయన రక్షణను అర్ధించబడిన విషయాలు ఉన్నాయి.
  8. ఈ హదీసు లో మహోన్నతుడైన అల్లాహ్ యే సృష్టికార్యకలాపాలను నడిపే సంపూర్ణ అధికారి మరియు హృదయాలకు ఋజుమార్గాన్ని మరియు మార్గభ్రష్టత్వానికి గురిచేయడం ఆయన చేతుల్లో మాత్రమే ఉంది అనే విషయాన్ని అంగీకరించాలన్న విషయం తెలియజేయబడింది.
  9. ఈ హదీసులో-ఇస్లాం కు తాళపు చెవులయిన రెండు సాక్ష్యాల అంగీకారము గురించి ఉంది,అవి రెండు ఇస్లాముయొక్క అసలైన పునాదులు మరియు మూలాలు,ఒక వ్యక్తి ఆ రెండింటినీ అంగీకరించకుండా మరియు మనస్ఫూర్తిగా స్వీకరించనంత వరకు ముస్లిము కాజాలడు అనే విషయం తెలియజేయబడుతుంది.