+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَيُّهَا النَّاسُ، إِنَّ اللهَ طَيِّبٌ لَا يَقْبَلُ إِلَّا طَيِّبًا، وَإِنَّ اللهَ أَمَرَ الْمُؤْمِنِينَ بِمَا أَمَرَ بِهِ الْمُرْسَلِينَ، فَقَالَ: {يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا، إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ} [المؤمنون: 51] وَقَالَ: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} [البقرة: 172] ثُمَّ ذَكَرَ الرَّجُلَ يُطِيلُ السَّفَرَ أَشْعَثَ أَغْبَرَ، يَمُدُّ يَدَيْهِ إِلَى السَّمَاءِ: يَا رَبِّ، يَا رَبِّ، وَمَطْعَمُهُ حَرَامٌ، وَمَشْرَبُهُ حَرَامٌ، وَمَلْبَسُهُ حَرَامٌ، وَغُذِيَ بِالْحَرَامِ، فَأَنَّى يُسْتَجَابُ لِذَلِكَ؟».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1015]
المزيــد ...

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు మరియు పరిశుద్ధమైన వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు. ప్రవక్తలకు ఆదేశించిన దానినే అల్లాహ్ విశ్వాసులకూ ఆదేశించినాడు. దివ్య ఖుర్’ఆన్ లోని అల్లాహ్ ప్రకటన: “ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు” [సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ మరో ప్రకటన: “ఓ విశ్వాసులారా! మీరు నిజంగా కేవలం ఆయన (అల్లాహ్‌)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ప్రసాదించిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి...” [సూరహ్ అల్ బఖరహ్ 2:172]. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సుదూర ప్రయాణీకుడి గురించి ప్రస్తావించినారు, అతడి తలవెంట్రుకలు చిందరవందరగా ఉన్నాయి, అతడి శరీరమంతా మట్టికొట్టుకుని ఉంది, అతడు తన రెండు చేతులు ఆకాశం వైపునకు చాచి “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ వేడుకుంటున్నాడు. మరి చూడబోతే అతని ఆహారం హరాం (ధర్మసమ్మతమైనది కాదు); అతని పానీయం హరాం, అతని దుస్తులు హరాం, మరియు అతని పోషణ పూర్తిగా హరాం. మరి అది (అతని దుఆ, వేడుకోలు) ఎలా స్వీకరించబడుతుంది?”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1015]

వివరణ

ఈ హదీథులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు పరమ పవిత్రుడు, కొరతలు, లోపాలు మరియు దోషాలు లేనివాడు మరియు పరిపూర్ణతలతో కూడిన సంపూర్ణ గుణగణాలు, లక్షణాలు కలిగిన వాడు. ఆయన మంచిని మరియు పరిశుద్ధమైన వాటిని, మరియు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించిన వాటిని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకానికి అనుగుణంగా ఉన్న వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు – అవి ఆచరణలైనా, పలుకులైనా లేదా నమ్మకాలైనా. వీటి ద్వారా తప్ప ఎవరూ అల్లాహ్ సామీప్యానికి చేరుకోవాలని కోరుకోరాదు. విశ్వాసి తన ఆచరణలను ఉత్తమమైనవిగా మార్చుకోవడానికి ఉన్న మార్గాలలో ఉత్తమమైనది ఏమిటంటే అతడు తినే ఆహారం పరిశుద్ధమైనదై ఉండడం, అంటే హలాల్ సంపాదన ద్వారా సంపాదించినది మాత్రమే తినడం. అది అతడి ఆచరణలను పరిశుద్ధ పరుస్తుంది. ఆ విధంగా అతడి ఆచరణలు పరిశుద్ధమవుతాయి. కనుక, అల్లాహ్ తాను ప్రవక్తలకు, సందేశహరులకు ఏదైతే ఆదేశించినాడో, దానినే విశ్వాసుల కొరకు కూడా ఆదేశించినాడు: ధర్మసమ్మతమైన దానిని (హలాల్) మాత్రమే తినండి మరియు మంచి పనులు చేయండి’ అని. అల్లాహ్ ప్రకటన, { يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ } [ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. 17 నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు. సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ ప్రకటన: { يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} [ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్‌)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి, సూరహ్ అల్ బఖరహ్ 2:172]
ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హరాం (ధర్మ విరుద్ధమైనది) తినరాదని హెచ్చరించినారు. అది ఆచరణలను నాశనం చేస్తుంది. అది ఆచరణలు (అల్లాహ్ వద్ద) స్వీకరించబడడాన్ని నిరోధిస్తుంది; ఆ బాటసారి ఆమోదయోగ్యమైన స్పష్టమైన మార్గాలను ఉపయోగించినప్పటికీ అతని ఆచరణలు ఆమోదయోగ్యం కావు: ఉదాహరణకు:
మొదటిది: (అల్లాహ్’కు) విధేయతను చూపే వాటిని ఆచరించుటకు అతడు ఎంత దూరం ప్రయాణించినా, అంటే హజ్ చేయడం, జిహాద్ లో పాల్గొనడం, అలాగే బంధుత్వాలను గౌరవించడం, వాటిని నిభాయించడం మొదలైనవి చేసినా, చేస్తూ ఉన్నా.
రెండవది: తల వెంట్రుకలను దువ్వుకోకపోవడం వల్ల చిందరవందరగా ఉన్న వెంట్రుకలు, దుమ్ము కారణంగా రంగు మారిన చర్మం మరియు అతని ఒంటిపై బట్టలు కూడా రంగు మారి, అతను నిస్సహాయంగా దీనస్థితిలో ఉన్నాడు.
మూడవది: అతడు తన రెండు చేతులను ఆకాశం వైపునకు ఎత్తి దుఆ చేయడం.
నాల్గవది: అల్లాహ్’ను ఆయన పేర్ల ద్వారా పట్టుదలతో వేడుకొనడం: “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ.
ఈ విధంగా ప్రార్థనలకు జవాబు లభించటానికి ఆవశ్యకమైన అన్ని మార్గాలు ఉన్నప్పటికీ, అతడికి ఏ సమాధానమూ లభించ లేదు; ఎందుకంటే అతని ఆహారం, పానీయం మరియు బట్టలు హరాం (అక్రమమైనవి), మరియు అతడు హరాం (ధర్మ విరుద్ధమైన, అక్రమమైన వాటి) ద్వారా పోషించబడ్డాడు. ఈ హదీథులో వర్ణించబడినటువంటి వ్యక్తి విన్నపానికి, అతని వేడుకోలుకు సమాధానం లభించడం దాదాపుగా అసంభవం; దానికి ఎలా సమాధానం లభిస్తుంది?

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الرومانية Малагашӣ Урумӣ
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తన ఉనికిలో, తన సర్వోత్కృష్ట గుణగణాల, లక్షణాలలో, తన కార్యాలలో మరియు తన ఆఙ్ఞలు, ఆదేశాలలో పరిపూర్ణుడు.
  2. ఇక్కడ ఆచరణలలో నిజాయితీ, మరియు ఆ ఆచరణలు కేవలం అల్లహ్ కొరకు మాత్రమే అయి ఉండాలి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి, వారి మార్గదర్శకానికీ అనుగుణంగా ఉండాలి అనే ఆదేశం ఉన్నది.
  3. ఇంకా ఇక్కడ, ఆచరణలలో ప్రేరణ కొరకు ప్రోత్సాహకరమైన పద్ధతులను ఉపయోగించుట చూడవచ్చును, ఉదాహరణకు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “”ప్రవక్తలు, సందేశహరులకు ఆదేశించిన వాటినే అల్లాహ్ విశ్వాసులకూ ఆదేశించినాడు”. కనుక, ప్రవక్తలు, సందేశహరులు అలాంటి పనులు చేయమని ఆజ్ఞాపించబడ్డారని విశ్వాసి గ్రహించినప్పుడు, అతను ప్రేరేపించబడతాడు మరియు ఆ ఆచరణల పట్ల, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించడం పట్ల ప్రోత్సహించబడతాడు.
  4. దుఆలు, వేడుకోలు స్వీకరించబడక పోవడానికి ఉన్న కారణాలలో, వాటికి సమాధానం రాకపోవడానికి ఉన్న కారణాలలో ఒకటి హరాం తినడం.
  5. దుఆలకు సమాధానాలు లభించే సాధనాలలో ఐదు విషయాలున్నాయి, అవి: 1). దీర్ఘకాల ప్రయాణాలు: సుదీర్ఘకాలం ప్రయాణంలో ఉంటే మనిషి అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా విచ్చిన్నం అవుతాడు. అతని దయనీయ స్థితి, అతని విషాదము, ఇవి అతని దుఆలు సమాధాన పరచబడుటకు ఉన్న ముఖ్య కారణాలలో ఒకటి; 2). తీవ్రమైన అవసరంలో ఉన్న పరిస్థితి; 3) దుఆ చేయుట కొరకు ఆకాశం వైపునకు చేతులు పైకి ఎత్తడం; 4) అల్లాహ్’ తన ప్రభువు అని పేర్కొంటూ “ఓ నా ప్రభువా! ఓ నా ప్రభువా!” అంటూ నిరంతరం ప్రార్థించడం (దుఆ చేయాడం). ఇది మన దుఆలకు సమాధానాలు కోరుకునే గొప్ప విధానాలలో ఒకటి. 5) ధర్మసమ్మతమైన వాటిని మాత్రమే తినడం, త్రాగడం.
  6. మంచి పనులు చేయటానికి సహాయపడే కారణాలలో ఒకటి, ధర్మసమ్మతమైన మరియు స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం.
  7. అల్ ఖాదీ ఇలా అన్నారు: (అరబీ భాషలో) “అత్-తయ్యిబ్” అనే పదం ‘మంచి’ని, పవిత్రత, పరిశుద్ధతను సూచిస్తుంది. ఇది ‘చెడు’కు వ్యతిరేకం. సర్వోన్నతుడైన అల్లాహ్’ను వర్ణించడానికి, అల్లాహ్’ను గురించి వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తే దాని అర్థం ‘అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు పవిత్రుడు, లోపాలు మరియు దోషాలకు అతీతుడు మరియు పరిపూర్ణతలతో కూడిన గుణలక్షణాలు కలిగినవాడు అని అర్థం. అయితే అల్లాహ్ యొక్క ఒక దాసుణ్ణి గురించి వర్ణిస్తూ ఉపయోగించినట్లైతే అతడు చెడు పనుల నుండి, దుర్గుణాల నుండి విముక్తి పొందినవాడు అని, మరియు దాని వ్యతిరేక లక్షణాలు కలిగిన వాడు అని అర్థం, మరోవైపు, సంపదలను వర్ణించడానికి, వివరించడానికి ఆ పదాన్ని (అత్-తయ్యిబ్) ఉపయోగించినప్పుడు, ఆ సంపదలు ధర్మసమ్మతమైనవి మరియు ఉత్తమమైనవి అని అర్థం
ఇంకా