+ -

عَنْ أَبِي الدَّرْدَاءِ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ، وَإِنَّ اللَّهَ لَيُبْغِضُ الفَاحِشَ البَذِيءَ».

[صحيح] - [رواه أبو داود والترمذي] - [سنن الترمذي: 2002]
المزيــد ...

అబూ అద్దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
తీర్పు రోజున విశ్వాసుల త్రాసులో మంచి నైతికత కంటే బరువైనది ఏదీ లేదు. నిశ్చయంగా, అల్లాహ్ అసభ్యకరమైన మరియు నిత్యం తిట్లు, బూతులు పలికే అవమానకరమైన వ్యక్తిని అసహ్యించుకుంటాడు.

[దృఢమైనది] - - [سنن الترمذي - 2002]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరుత్థాన దినమున ఒక విశ్వాసి యొక్క మాటలు మరియు చేతలలో, అతని త్రాసుపై అన్నింటికన్నా భారమైనది అతని నైతికత మరియు నైతిక విలువలు, అనగా ప్రసన్నమైన వ్యక్తిత్వము, చిరునవ్వు కలిగిన ముఖముతో ఇతరులను కలవడం, ఇతరులకు హాని కలిగించే వాటి నుండి దూరంగా ఉండడం, ప్రజలకు మంచి చేసే పనులు చేయడం మొదలైనవి. మరియు మాటలు చేతలలో అసహ్యకరమైన వ్యక్తిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు, అతడు తన నాలుకతో తిట్లు, బూతులు పలుకుతాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో ఉన్నత శీలసంపద, ఉన్నత వ్యక్తిత్వము యొక్క ఘనత తెలియుచున్నది. అది అల్లాహ్ యొక్క ప్రేమను పొందడానికి, తద్వారా ఆయన దాసుల ప్రేమను పొందడానికి దారితీస్తుంది. పునరుత్థానదినమున మరి అదే అతని త్రాసులో అత్యంత బరువైనదిగా ఉంటుంది.
ఇంకా