عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ يَنْظُرُ اللَّهُ إِلَى مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلاَءَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5783]
المزيــد ...
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
ఎవరైతే గర్వంతో (అహంకారంతో) తన వస్త్రాన్ని నేలపై ఈడుస్తూ నడుస్తాడో, పరలోకంలో అల్లాహ్ అలాంటి వారి వైపు చూడడు.
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 5783]
ప్రవక్త ﷺ ఇలా హెచ్చరించారు: క్రింది వస్త్రాన్ని లేదా ఇజార్‌ను (దుస్తులు) కాళ్ల మడమలకు (కీళ్ళకు) దిగువగా, అహంకారం మరియు గర్వంతో (అభిమానంతో) జార విడవడం నుండి జాగ్రత్త పడాలి. ఎవరైతే అలా చేస్తారో, అలాంటి వారు తీర్పుదినం నాడు అల్లాహ్ యొక్క దయా దృష్టిని పొందే అర్హతను కోల్పోతారు. అంటే, అల్లాహ్ వారిని క్షమించడు, వారిపై దయ చూపడు.