عن عبد الله بن عمر رضي الله عنهما مرفوعاً: «الْحَيَاء مِنْ الْإِيمَانِ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబ్దుల్లా బిన్ ఉమర్ రజియాల్లాహు అన్హుమ‘మర్ఫూ ఉల్లేఖనం‘సిగ్గు బిడియం ఈమాన్ లో భాగము.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

నమ్రత,బిడియం విశ్వాసం యొక్క ఒక భాగం, ఎందుకంటే నమ్రత గల వ్యక్తి తన నమ్రత ద్వారా పాపాలకు దూరంగా తీయబడతాడు మరియు ధర్మపరమైన బాధ్యతలను నిర్వర్తించాలని కోరతాడు./ నమ్రత విశ్వాసం యొక్క ఒక భాగం ఎందుకంటే సిగ్గుపడే వ్యక్తి అవిధేయతను తనసిగ్గు వల్ల నిరోధించి వివిధ ధర్మబాధ్యతలను నిర్వర్తిస్తాడు.ఇది మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం కలిగియుండటం వల్ల కలిగే ఒక ప్రయోజనం,హృదయం సిగ్గుతో నిండియున్నప్పుడే సుమా,ఖచ్చితంగా సిగ్గు అపరాధిని అవిధేయత నుండి నిరోధించగలదు మరియు ధర్మబాధ్యతలను నిర్వర్తించటానికి అతన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఒక దాసుడికి ప్రయోజనకరమైన ప్రభావం పరంగా నమ్రత విశ్వాసంలా మారుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. నమ్రత నైతికతను కూడా ఈమాన్ వలె పెంపోదించుకోవలెనని ప్రోత్సహించబడుతుంది.
  2. నిశ్చయంగా 'అల్ హయా’ మేలైన సత్కర్మల సాధనపట్ల ఆసక్తిపరుస్తూ మరియు కీడైన విషయాల నుండి నిరోధిస్తుంది.
  3. మంచితనం నుండి మిమ్మల్ని నిరోధించేదాన్ని సిగ్గు అనరు,కానీ దాన్ని సిగ్గులేమి,నిస్సహాయత,అవమానం మరియు పిరికితనం అంటారు.
  4. నిశ్చయంగా (అల్ హయా) సిగ్గు అల్లాహ్ వైపునుండి అనుగ్రహించబడుతుంది,అది ఆదేశాలను నిర్వహించడంతో పాటు పనికిమాలిన విషయాలనుండి నిరోధిస్తూ ఉంటుంది,ఖచ్చితంగా సృష్టితాలలో (అల్ హయా)సిగ్గు ఉంటుంది,అది వారి గౌరవం వల్ల ఉంటుంది,వారి అమర్యాద వల్ల వెళ్లిపోతుంది.
ఇంకా