عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الدُّعَاءُ لاَ يُرَدُّ بَيْنَ الأَذَانِ وَالإِقَامَةِ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن الترمذي: 212]
المزيــد ...
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”
[దృఢమైనది] - - [سنن الترمذي - 212]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదాన్’కు మరియు ఇఖామహ్’కు మధ్య చేయు దుఆ యొక్క ఘనతను వివరించారు మరియు ఇది తిరస్కరించబడదని; సమాధానం పొందే అవకాశం ఉందని, కాబట్టి ఈ సమయంలో అల్లాహ్’ సన్నిధిలో దుఆ చేయండి అని పేర్కొన్నారు.