عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«اللهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي، وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ، وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2720]
المزيــد ...
అబూహురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు:
“అల్లాహుమ్మ అస్లిహ్’లీ దీనీ అల్లదీ హువ ఇస్మతు అమ్రీ; వ అస్లిహ్’లీ దున్యాయా, అల్లతీ ఫీహా మఆషీ; వ అస్లిహ్’లీ ఆఖిరతీ, అల్లతీ ఫీహా మఆదీ; వ అజ్’అలిల్ హయాత జియాదతన్’లీ ఫీ కుల్లి ఖైరిన్; వజ్’అలిల్ మౌత రాహతన్’లీ మిన్ కుల్లి షర్రిన్”; (ఓ అల్లాహ్! నా ధర్మాన్ని (నా ధర్మానుసరణను) నా కొరకు సరిచేయి - ఎందులోనైతే నా రక్షణ ఉన్నదో; మరియు నా ఈ ప్రపంచాన్ని సరిచేయి - ఎందులోనైతే నా జీవనం ఉన్నదో; మరియు శుభప్రదమైన ప్రతి దానిలోనూ నా జీవనాన్ని పొడిగించు; మరియు వినాశనాన్ని కలిగించే ప్రతి దానిలోనూ మరణాన్ని నాకు ప్రశాంతత కలిగించే దానిలా చేయి”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2720]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప దుఆను పఠిస్తూ ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏ నైతిక విలువలను, ఏ నైతిక సూత్రాలను పరిపూర్ణం చేయడానికి పంపబడినారో, వాటికి సంబంధించిన విషయాల వేడుకోలు ఉంది ఆ దుఆలో. అవి: ధర్మానుసరణలో నీతిమంతంగా, ధర్మబద్ధంగా గడపడం - ఈ ప్రాపంచిక జీవితంలో మరియు పరలోకజీవితంలో. ఆ దుఆలో ఉన్నటువంటి సంక్షిప్తమైన పదాల ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాల ప్రాముఖ్యత సమగ్రంగా తెలిసేలా చేసారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మానుసరణను సరిచేయమనే వేడుకోలుతో ఆ దుఆను ప్రారంభించినారు; ఎందుకంటే ఇహలోకజీవితము, పరలోక జీవితము యొక్క పరిస్థితులు సఫలీకృతం కావడానికి హామీనిచ్చేది ధర్మబద్ధమైన, నీతిమంతమైన ధర్మానుసరణ మాత్రమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహుమ్మ అస్లిహ్’లీ దీనీ” ధర్మం ఆదేశించిన ఆచరణలను ఆదేశించిన విధానములో, అత్యంత పరిపూర్ణంగా ధార్మిక పరమైన విధులను నిర్వహించడానికి నన్ను అనుమతించడం ద్వారా ‘ఓ అల్లాహ్! నా కొరకు నా ధర్మాన్ని (నా ధర్మానుసరణను) సరిచేయి.”
అల్లదీ హువ ఇస్మతు అమ్రీ - ఎందులోనైతే నా రక్షణ ఉన్నదో; మరియు నా వ్యవహారాలన్నింటి సంరక్షణ ఉన్నదో. నా ధర్మానుసరణ కలుషితమైపోతే, నా వ్యవహారలన్నీ కలుషితమైపోతాయి; నాకు ఆశాభంగమైపోతుంది, నేను ఓడిపోయిన వాడినవుతాను. ఎందుకంటే నా ధర్మం (నా ధర్మానుసరణ) సంపూర్ణంగా సవరించకపోతే నా ప్రపంచం (నా ప్రాపంచిక జీవితం) సవరించబడుట కూడా సాధించబడదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
(ఓ అల్లాహ్!) నాకు శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించు, నాకు రక్షణను, తద్వారా శాంతిని ప్రసాదించు, నాకు జీవనోపాధిని ప్రసాదించు, ధార్మికురాలైన జీవితభాగస్వామిని ప్రసాదించు, ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు, అలాగే నాకు అవసరమైన ప్రతి దానినీ నాకు ప్రసాదించు, మరియు దానిని ధర్మబద్ధమైనదిగా చేయి (హలాల్), అది నీకు విధేయునిగా ఉండుటలో నాకు సహాయపడుతుంది; తద్వారా నా ఈ ప్రపంచాన్ని సరి చేయి” (“వ అస్లిహ్’లీ దున్యాయా” - నా ప్రాపంచిక జీవితాన్ని సరిచేయి). తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రపంచాన్ని సరి చేయి అని అర్థించడానికి వెనుక గల కారణాన్ని ఆయన ఇలా వివరించినారు:
(అల్లతీ ఫీహా మ’ఆషీ) ఎందుకంటే అది నా ఉపాధి స్థలం మరియు నా జీవితకాలాన్ని గడిపే ప్రదేశం.
(వ అస్లిహ్’లీ ఆఖిరతీ, అల్లతీ ఫీహా మఆదీ) మరియు నా పరలోకాన్ని సరిచేయి; ఎందుకంటే అది నిన్ను కలుసుకునే నా తిరుగు ప్రయాణం – ఇది ధర్మబద్ధమైన పనులు మరియు ఆరాధన, చిత్తశుద్ధి మరియు మంచి ముగింపు కోసం అల్లాహ్ తన దాసునికి ప్రసాదించే మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే సాధించబడుతుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరలోక జీవితాన్ని, ఈ ప్రాపంచిక జీవితం తరువాత పేర్కొన్నారు. ఎందుకంటే మొదటిది (ఇహలోక జీవితం), రెండవదానిని (పరలోకజీవితాన్ని) సరిచేసే సాధనం. కనుక ఎవరైతే ఈ ఇహలోక జీవితంలో అల్లాహ్ యొక్క అభీష్ఠానికి అనుగుణంగా నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటాడో అతని పరలోక జీవితం సరిగా ఉంటుంది మరియు అతడు అందులో సుఖసంతోషాలతో ఉంటాడు.
వ అజ్’అలిల్ హయాత జియాదతన్’లీ ఫీ కుల్లి ఖైరిన్; వజ్’అలిల్ మౌత రాహతన్’లీ మిన్ కుల్లి షర్రిన్) మరియు నా ధర్మబద్ధమైన పనులను పెంచుకుంటూ పోవడానికి ప్రతి మంచిలో నా జీవితాన్ని, మరియు నా ఆయుర్ధాయాన్ని పెంచు; మరియు ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి పరీక్ష నుండి, అవిధేయత, అజాగ్రత్తల నుండి, మరియు బాధల నుండి నాకు ఉపశమనం కలిగించేలా, వాటన్నిటి నుండి విముక్తిగా, ఓదార్పు పొందేలా మరణాన్ని నాకు చేరువ చేయి.