عَنِ أَبِي مُوسَى رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ كَانَ يَدْعُو بِهَذَا الدُّعَاءِ:
«رَبِّ اغْفِرْ لِي خَطِيئَتِي وَجَهْلِي، وَإِسْرَافِي فِي أَمْرِي كُلِّهِ، وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي، اللَّهُمَّ اغْفِرْ لِي خَطَايَايَ، وَعَمْدِي وَجَهْلِي وَهَزْلِي، وَكُلُّ ذَلِكَ عِنْدِي، اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ، وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ، أَنْتَ المُقَدِّمُ وَأَنْتَ المُؤَخِّرُ، وَأَنْتَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6398]
المزيــد ...
అబూ మూసా అల్ అష్’అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేస్తూ ఉండేవారు:
“రబ్బిఘ్’ఫిర్లీ ఖతీఅతీ వ జహ్లీ; వ ఇస్రాఫీ ఫీఅమ్రీ కుల్లిహి; వమా అన్త ఆలము బిహి మిన్నీ; అల్లాహుమ్మగ్’ఫిర్లీ ఖతాయాయ, వఅమ్’దీ, వ జహ్’లీ, వ హజ్’లీ, వ కుల్లు జాలిక ఇన్దీ; అల్లాహుమ్మగ్'ఫిర్’లీ మా ఖద్దంతు; వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్’తు, వమా ఆ’లన్’తు; అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅఖ్ఖిరు; వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్”
(ఓ నా ప్రభూ! నా తప్పులను మన్నించు, నా వ్యవహారాలన్నింటిలో నేను అతిక్రమించిన ప్రతి విషయాన్ని మన్నించు, ఈ విషయాల గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా లేదా నా అఙ్ఞానం వలన లేదా నేను హాస్యంగా లేక అపహాస్యంగా చేసిన తప్పులన్నింటినీ మన్నించు మరియు నేను చేసే ప్రతి పనిలో నా తప్పులన్నింటినీ మన్నించు. ఓ అల్లాహ్! నా గత పాపాలను, నా భవిష్యత్తు పాపాలను, నా రహస్య పాపాలను, నా బహిరంగ పాపాలను క్షమించు. ఆది నీవే, అంతమూ నీవే, అన్ని విషయలపై అధికారం గలవాడవు నీవే)
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6398]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమగ్రమైన దుఆలలో ఈవిధంగా దుఆ చేయుట ఒకటి:
“రబ్బిఘ్’ఫిర్’లీ ఖతీఅతీ” వదంబీ, “వజహ్’లీ” వమావఖఅ మిన్నీ బిదూన ఇల్మ్: ఓ నా ప్రభూ! నా తప్పులను క్షమించు, నా పాపాలను క్షమించు, నా అఙ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని క్షమించు, మరియు అఙ్ఞానం కారణంగా నా వలన జరిగే వాటన్నింటినీ క్షమించు.
వ ఇస్రాఫీ ఫీ అమ్రీ కుల్లహు, “వతఖ్’సీరీ, వతజావుజీ లిల్’హద్”: నా విషయాలలో నేను అతి చేయడాన్ని (దుబారాను) క్షమించు; నా ఆచరణలలో చోటు చేసుకునే కొరతలను, మరియు మితిమీరడాన్ని క్షమించు.
వమా అంత ఆలము బిహీ మిన్నీ “అలిమ్’తహు అన్’త యా అల్లాహ్ వ నసీతుహు అనా”
నా గురించి నా కన్నా బాగా ఎరిగిన వాడవు నీవే, నీకు నా గురించి అన్నీ తెలుసు, నాకు మతిమరుపు ఉంది (కనుక నీవు ఎరిగిన నా తప్పులన్నింటినీ క్షమించు).
అల్లాహుమ్మఘ్’ఫిర్’లీ ఖతాయాయ వ అమ్’దీ, “వమా సదర అన్ అమ్’దిన్ మిన్నీ, వ ఇల్మిన్ మిన్నీ బిద్దూనూబ్”
ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పులన్నింటినీ క్షమించు; “ఆ పాపాల గురించి తెలిసి ఉండీ, ఉద్దేశ్యపూర్వకంగా నేను పాల్బడిన పాపాలన్నింటినీ క్షమించు”
“వ జదీ, వ హజ్’లీ” వమా సదర అన్ ముజాహ్, వమా వఖ్అ మిన్నీ ఫిల్ హాలైన్:
ఓ అల్లాహ్ ! నా వల్ల జరిగిన గంభీరమైన పాపములను, మరియు నా వల్ల పరిహాసపూరితంగా, లేక అపహాస్యపరంగా జరిగిన పాపాలను మరియు ఈ రెండు రకాలుగా జరిగిన పాపాలను క్షమించు.
“వకుల్లు దాలిక ఇందీ” “హైథు జమ’అత్ మా జుకిర మినల్ దునూబి వల్ ఉయూబ్”
పాపాలు మరియు తప్పులను గురించి ప్రస్తావించబడిన ప్రతిదీ నాలో ఉంది. (వాటన్నిటినీ క్షమించు).
“అల్లాహుమ్మఘ్’ఫిర్’లీ మా ఖద్దంతు ఫీమా మాదీ; వ మా అఖ్ఖర్తు ఫీమా సయ’తీ”
"ఓ అల్లాహ్, నేను గతంలో చేసిన దాని కోసం నన్ను క్షమించు, మరియు నేను తరువాత చేసిన దాని కోసం, మరియు రాబోయే దాని కోసం నన్ను క్షమించు.
“వమా అస్’రర్తు” వ ఉఖ్’ఫియత్, “వమా అ’లన్తు” వ ఉజ్’హిరత్”
నేను గోప్యంగా ఉంచిన వాటిని క్షమించు, మరియు దాచిపెట్టిన మరియు నేను ప్రకటించిన మరియు స్పష్టం చేసిన వాటన్నింటిని క్షమించు.
“అంతల్ ముఖద్దిము, వ అంతల్ ముఅఖ్ఖిరు” (ఆది నీవే అంతమూ నీవే) నీవు తలచిన వానిని, అతనికి సాఫల్యాన్ని ప్రసాదించడం ద్వారా నీవు నీ కరుణకు చేరువ చేస్తావు; మరియు నీవు తలచిన వానిని నిరాశకు గురి చేసి నీ కరుణ నుండి దూరం చేస్తావు. కనుక నీవు దేనినైనా దూరం చేస్తే దానిని ప్రసాదించగలవాడెవడూ లేడు, మరియు నీవు దేనినైనా ప్రసాదించదలిస్తే దానిని దూరం చేయగలవాడేవ్వడూ లేడు.
“వ అంత అలా కుల్లి షఇన్ ఖదీర్” అన్ని విషయాలపై అధికారం గలవాడవు నీవే - శక్తిలో సంపూర్ణుడవు మరియు సంకల్పంలో పరిపూర్ణుడవు, కోరుకున్న ప్రతి విషయాన్నీ చేయగలవాడవు నీవే.