عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَيْسَ الْمُؤْمِنُ بِالطَّعَّانِ وَلاَ اللَّعَّانِ وَلاَ الفَاحِشِ وَلاَ البَذِيءِ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 1977]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒక విశ్వాసి అపవాది కాజాలడు (ఇతరులపై అపవాదులు మోపు వాడు), ఇతరులను శపించడు మరియు అనైతిక చర్యలకు పాల్బడడు లేదా సిగ్గుమాలిన పనులు చేయడు.”
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 1977]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఒక విశ్వాసి యొక్క ప్రవృత్తి ఇలా ఉండదు – ఇతరులను వారి వంశం ఆధారంగా (కులం, మతం, ధర్మం ఆధారంగా) విమర్శించడం, లేదా శపించడం, లేదా తిట్లు తిట్టడం, మాటలలోగానీ లేక చేతలలో గానీ సిగ్గుమాలిన తనానికి పాల్బడడం. ఒక నిజమైన విశ్వాసి ఇవన్ని చేయడు.