+ -

عَنْ عَلِيٍّ رَضِيَ اللَّهُ عَنْهُ: إِذَا حَدَّثْتُكُمْ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَأَنْ أَخِرَّ مِنَ السَّمَاءِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَكْذِبَ عَلَيْهِ، وَإِذَا حَدَّثْتُكُمْ فِيمَا بَيْنِي وَبَيْنَكُمْ فَإِنَّ الحَرْبَ خَدْعَةٌ، سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«يَأْتِي فِي آخِرِ الزَّمَانِ قَوْمٌ حُدَثَاءُ الأَسْنَانِ سُفَهَاءُ الأَحْلاَمِ، يَقُولُونَ مِنْ خَيْرِ قَوْلِ البَرِيَّةِ، يَمْرُقُونَ مِنَ الإِسْلاَمِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ، لاَ يُجَاوِزُ إِيمَانُهُمْ حَنَاجِرَهُمْ، فَأَيْنَمَا لَقِيتُمُوهُمْ فَاقْتُلُوهُمْ، فَإِنَّ قَتْلَهُمْ أَجْرٌ لِمَنْ قَتَلَهُمْ يَوْمَ القِيَامَةِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3611]
المزيــد ...

అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఒకవేళ నేను రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి నుండి ఏమైనా ఉల్లేఖిస్తున్నట్లైతే, వారి గురించి అసత్యం పలకడం కన్నా ఆకాశం నుండి భూమిపై పడిపోవడాన్ని ఇష్ట పడతాను. కానీ మీకూ నాకూ మధ్య ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నట్లైతే, నిశ్చయంగా యుధ్ధమంటేనే తంత్రము మరి. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“ప్రపంచపు చివరి కాలము లో, వయస్సులో చిన్నవారు మరియు బుద్ధిలో మూర్ఖులు అయిన ఒక ప్రజ పుట్టుకొస్తుంది. వారు (తమ వాదనలో) అందరికంటే ఉత్తమమైన ప్రసంగాన్ని (అంటే ఖురాన్) ఉపయోగిస్తారు; వేట జంతువు శరీరం నుండి బాణం దూసుకు పోయిన విధంగా వారు ఇస్లాం నుండి వెళ్ళిపోతారు. వారి విశ్వాసం వారి గొంతులను దాటి వెళ్ళదు. మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి, ఎందుకంటే వారిని చంపడం, తీర్పు దినమున, వారిని చంపిన వారికి ప్రతిఫలం గా మారుతుంది.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3611]

వివరణ

అమీరుల్ ము’మినీన్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: “నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఏమైనా ఉల్లేఖిస్తున్నట్లు మీరు విన్నట్లైతే, నేను భావగర్భితముగా అలంకారిక భాషను ఉపయోగించను, లేదా సూచనల రూపములో అస్పష్టమైన ప్రకటనలు చేయను; లేదా విషయాన్ని పరోక్షంగా చెప్పను. నిశ్చయంగా నేను స్పష్టంగా మాత్రమే మాట్లాడుతాను. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఉల్లేఖిస్తూ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అసత్యాలు పలకడం కంటే నేను ఆకాశం నుండి భూమిపై పడిపోవడం నాకు సులభమైనది మరియు తేలికైనది. అయితే, నాకు మరియు ప్రజలకు మధ్య ఉన్న విషయాల గురించి నేను మాట్లాడితే, మరి యుద్ధమంటేనే తంత్రము; నేను అలంకారిక భాష, సూచనలు లేదా ద్వంద్వ అర్థ ప్రకటనలను ఉపయోగించవచ్చు. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: కాలం చివరలో, ఒక యువత వస్తుంది, వారు వయస్సులో చిన్నవారై ఉంటారు మరియు తెలివితేటలలో బలహీనంగా ఉంటారు. వారు ఖురాన్ నుండి పదాలను ఉటంకిస్తూ ఉంటారు, ఖుర్’ఆన్ ను తరచుగా పఠిస్తారు, కానీ బాణం దాని లక్ష్యం గుండా దూసుకు వెళ్ళినట్లుగా వారు ఇస్లాంను విడిచిపెట్టి దాని హద్దులను అతిక్రమిస్తారు. వారి విశ్వాసం వారి గొంతులను దాటి వెళ్ళదు. మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి, ఎందుకంటే వారిని చంపడం, పునరుత్థాన దినమున, చంపిన వానికి ప్రతిఫలంగా మారుతుంది.

من فوائد الحديث

  1. ఈ హదీథులో ‘ఖవారిజ్’ల యొక్క గుణలక్షణాలు పేర్కొనబడినాయి.
  2. ఈ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవక్తత్వానికి ఒక సంకేతం ఉంది, ఎందుకంటే ఆయన తన తర్వాత తన సమాజంలో (ఉమ్మత్’లో) జరగబోయే సంఘటనలను ముందే తెలియజేశారు మరియు అవి ఆయన తెలియజేసినట్లే జరిగాయి.
  3. యుద్ధంలో పరోక్ష ప్రసంగం చేయుట, తప్పుడు సూచనలు లేదా పరోక్ష సూచనలను ఉపయోగించడం షరియత్ లో అనుమతించ బడినది. యుద్ధతంత్రము అంటే తప్పుదారి పట్టించే ప్రకటనలు, పొంచి ఉండి ఆకస్మికంగా దాడి చేయడం మొదలైన ఇలాంటివి అన్నీ ఉంటాయి. అయితే అంతకు ముందే చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడం, భద్రతా హామీలను ఉల్లంఘించడం, ఒడంబడికలను ఖాతరు చేయకపోవడం లాంటివి చేయరాదు. ఇలాంటి చర్యలకు షరియత్’లో స్పష్టమైన నిషేధం ఉన్నది.
  4. ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) హదీథులో ‘వారు (తమ వాదనలో) అందరికంటే ఉత్తమమైన ప్రసంగాన్ని (అంటే ఖురాన్) ఉపయోగిస్తారు’ అనే వాక్యముపై వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: ‘అంటే దాని అర్థము వారు బయటకు “లా హుక్ము ఇల్లాబిల్లాహ్” (అల్లాహ్ తీర్పు తప్ప మరో తీర్పు లేదు) లాంటి మాటలు పలుకుతూ ఉండడం, ప్రజలను అల్లహ్ యొక్క గ్రంథం వైపునకు పిలవడం లో ఇలాంటి వ్యక్తీకరణలను ఉపయోగించడం.
  5. హాజిజ్ ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాటలు “వారి విశ్వాసం వారి గొంతులను దాటి వెళ్ళదు” అనే దానిపై వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: “అంటే దాని అర్థము విశ్వాసము వారి హృదయాలలో వేళ్ళూనుకొననే లేదు, ఎందుకంటే గొంతులోనే నిలిచిపోయి (అంటే మాటలలోనే ఉండిపోయి) దానిని దాటి వెళ్ళనిది ఏదీ హృదయాన్ని చేరలేదు.”
  6. అల్-ఖాదీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఖవారిజ్’లు మరియు వారితో సారూప్యత గలవారు “అహ్ల్ అల్ బిద’అ” (ధర్మములో నూతన ఆవిష్కరణలు చేసేవారు); ధర్మములో విద్రోహానికి పాల్బడే వారు మరియు దౌర్జన్యపరులలోని వారు అని ధర్మపండితులందరూ ఏకగ్రీవంగా అంగీకరించినారు. వారు పాలకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, సమాజ ఏకాభిప్రాయాన్ని వ్యతిరేకించినప్పుడు మరియు విభజనకు కారణమైనప్పుడు, వారిని హెచ్చరించి, వారికి క్షమాపణ చెప్పుకోవడానికి అవకాశమిచ్చి, వారికి తిరస్కరించలేని రుజువులను అందించిన తర్వాత, అప్పుడు వారితో పోరాడటం తప్పనిసరి అవుతుంది.”
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ బెంగాలీ సింహళ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా