عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ دَعَا إِلَى هُدًى كَانَ لَهُ مِنَ الْأَجْرِ مِثْلُ أُجُورِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ أُجُورِهِمْ شَيْئًا، وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2674]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి – ఆ మార్గాన్ని అనుసరించిన వారి పుణ్యమును పోలినంత పుణ్యము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పుణ్యములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు. మరియు ఎవరైతే మార్గభ్రష్టత్వము వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి - దానిని అనుసరించిన వారి పాపములను పోలినంత పాపము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పాపములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2674]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్ట పరిచినారు – ఎవరైతే ప్రజలకు సత్యమార్గము వైపునకు మరియు శుభము గల మార్గము వైపునకు, తన మాటల ద్వారా కానీ లేక తన ఆచరణల ద్వారా కానీ, మార్గదర్శకము చేసినా, లేక వారికి ఆ మార్గము వైపునకు దారి చూపినా, లేక ప్రోత్సహించినా, ప్రేరేపించినా – ఆ మార్గమును అనుసరించిన వారికి లభించిన పుణ్యాన్ని పోలినంత పుణ్యము అతనికి కూడా లభిస్తుంది – అయితే ఆ మార్గమును అనుసరించిన వారి పుణ్యములో కొద్దిగా కూడా తగ్గించబడదు. ఎవరైతే ప్రజలకు అసత్య మార్గము వైపునకు మరియు మార్గభ్రష్టత్వము వైపునకు, చెడు మరియు పాపము కలిగిన మార్గము వైపునకు లేదా షరియత్ అనుమతి లేని దాని వైపునకు (హరామ్ వైపునకు) తన మాటల ద్వారా కానీ లేక తన ఆచరణల ద్వారా కానీ, ప్రజలకు మార్గదర్శకము చేసినా, లేక వారికి ఆ మార్గము వైపునకు దారి చూపినా, లేక ప్రోత్సహించినా, ప్రేరేపించినా – ఆ భారము అతనిపై ఉంటుంది అలాగే ఆ మార్గమును అనుసరించిన వారికి లభించిన పాపాన్ని పోలినంత పాపము అతనికి లభిస్తుంది – అయితే ఆ మార్గమును అనుసరించిన వారి పాపములలో కొద్దిగా కూడా తగ్గించబడదు.