عَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ رضي الله عنه:
أَنَّ رَجُلًا أَكَلَ عِنْدَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِشِمَالِهِ، فَقَالَ: «كُلْ بِيَمِينِكَ»، قَالَ: لَا أَسْتَطِيعُ، قَالَ: «لَا اسْتَطَعْتَ»، مَا مَنَعَهُ إِلَّا الْكِبْرُ، قَالَ: فَمَا رَفَعَهَا إِلَى فِيهِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2021]
المزيــد ...
సలమహ్ ఇబ్న్ అల్ అక్వఇ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2021]
ఒక వ్యక్తి ఎడమ చేతితో తినడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసినారు. అందుకని అతడిని కుడి చేతితో తినమని ఆదేశించినారు. ఆ వ్యక్తి అహంకారం కొద్దీ అలా చేయలేనని అబద్ధం చెప్పాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడు కుడి చేతితో తినడం నిషేధమైపోయేలా దుఆ చేసారు. అతడి కుడి చేతికి పక్షవాతం వచ్చేలా చేసి, అల్లాహ్ ఆయన దుఆను స్వీకరించాడు.