عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَسْتُرُ عَبْدٌ عَبْدًا فِي الدُّنْيَا إِلَّا سَتَرَهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2590]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:
“అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2590]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దీనిని విశదీకరిస్తున్నారు. ఏ విషయంలోనైనా ఒక ముస్లిం తన తోటి ముస్లింను కప్పి ఉంచితే, తీర్పుదినమున అల్లాహ్ అతడిని కప్పి ఉంచుతాడు - ఎలాగైతే ప్రతి పనికి దానికి తగిన ప్రతిఫలం ఉంటుందో. అల్లాహ్ అతడిని కప్పి ఉంచుట అంటే అతడి తప్పులను, పాపాలను తీర్పుదినమున అక్కడ సమావేశపరచబడిన వారందరి ముందు వెల్లడించక పోవడం కావచ్చు; లేదా ఆ తప్పులకు, పాపాలకు అతడిని బాధ్యుడిని చేయకుండా, తీర్పుదినమున వాటిని అతనికి తెలియ పరచకుండా ఉండిపోవుట కావచ్చు.