عَنْ جَابِرٍ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ مِنْ أَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ أَحَاسِنَكُمْ أَخْلاَقًا، وَإِنَّ أَبْغَضَكُمْ إِلَيَّ وَأَبْعَدَكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ الثَّرْثَارُونَ وَالمُتَشَدِّقُونَ وَالمُتَفَيْهِقُونَ»، قَالُوا: يَا رَسُولَ اللهِ، قَدْ عَلِمْنَا الثَّرْثَارُونَ وَالمُتَشَدِّقُونَ فَمَا الْمُتَفَيْهِقُونَ؟ قَالَ: «الْمُتَكَبِّرُونَ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2018]
المزيــد ...
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే’ మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే ‘ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన’అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త ‘గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 2018]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీలో మంచి ప్రవర్తన గలవారే ఈ ప్రపంచంలో ఆయనకు అత్యంత ప్రియమైనవారు మరియు తీర్పు దినాన ఆయనకు అత్యంత సన్నిహితులు అని తెలియజేశారు. మీలో చెడు ప్రవర్తన గలవారే ఈ ప్రపంచంలో ఆయన అత్యంత అసహ్యించుకునేవారు మరియు తీర్పు దినాన ఆయనకు అత్యంత దూరంగా ఉండేవారు అని కూడా ఆయన పేర్కొన్నారు; అథ్'థర్'థారూన్ అనే అరబీ పదానికి అర్థం - అతిగా మరియు అనవసరంగా మాట్లాడేవారు, సత్యం నుండి తప్పుకునేవారు; అల్ ముతషద్దిఖూన్ అనే అరబీ పదానికి అర్థం - ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించకుండా వారి మాటలు మరింత ముఖ్యమైనవిగా అనిపించేలా తమ మాటలను అతిశయోక్తి చేసేవారు. మరియు (ముతఫైహిఖూన్) గురించి; వారు ఇలా అడిగినారు: ఓ రసూలుల్లాహ్! అతిగా మాట్లాడేవారు ఎవరో మరియు ఆడంబరాలు, గొప్పలు చెప్పుకునేవారు ఎవరో మాకు అర్థమైంది, కానీ ముతఫైహిఖూన్ లు అంటే ఎవరు? దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: వారు ఇతరులను ఎగతాళి చేస్తూ, వారిని హీనంగా చూస్తూ, అహంకారంతో మాట్లాడేవారు మరియు అహంకారులు.