عن عائشة رضي الله عنها مرفوعاً: «إن المؤمن ليدرك بحسن خلقه درجة الصائم القائم»
[صحيح] - [رواه أبو داود وأحمد]
المزيــد ...

ఆయెషా రజియల్లాహు అన్హా మర్ఫూ ఉల్లేఖనం’నిశ్చయంగా మోమిన్ తన మంచి నడవడిక ఉత్తమ సద్వర్తన వల్ల ఉపవాసికి మరియు తహజ్జుద్ చదివే వ్యక్తి యొక్క స్థానానికి చేరుకుంటాడు.
దృఢమైనది - దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ఉత్తమ నైతికత,సత్ప్రవర్తన యొక్క ఘనత పేర్కొనబడినది,ఈ ఉత్తమ నడవడిక వల్ల దాసుడు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాన్ని మరియు స్వర్గంలో ఉన్నత శ్రేణులను అధిరోహిస్తాడు అవి ఎల్లప్పుడు ఉపవాసాలు పాటిస్తూ తహజ్జుద్ నమాజులు చేసేవారికి మాత్రమే లభిస్తాయి ఇవి రెండు మహా సత్కార్యాలు ఇందులో మనిషికి విపరీతంగా శ్రమించవలసి ఉంటుంది,కానీ ఉత్తమంగా ప్రవర్తించడము,నడుచుకోవడం సులభమైన కార్యము.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. ఉత్తమ నడవడిక పుణ్యాన్ని బహుమతిని రెట్టింపు చేస్తుంది చివరికి దాసుడు వాటి ద్వారా నిరంతరంగా ఉపవాసాలు పాటించువాడి మరియు అలసట లేకుండా నమాజులు పాటించువాడి స్థానాన్ని పొందవచ్చు.
ఇంకా