عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِنَّ اللهَ لَيَرْضَى عَنِ الْعَبْدِ أَنْ يَأْكُلَ الْأَكْلَةَ فَيَحْمَدَهُ عَلَيْهَا، أَوْ يَشْرَبَ الشَّرْبَةَ فَيَحْمَدَهُ عَلَيْهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2734]
المزيــد ...
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2734]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు – అల్లాహ్ యొక్క ప్రీతి, ఆశీర్వాదాలు పొందే మార్గాలలో ఒకటి – దాసుడు తన ప్రభువు (అల్లాహ్) యొక్క అనుగ్రహాల పట్ల, ఆయన దాతృత్వము, కారుణ్యము పట్ల ఆయనను (అల్లాహ్ ను) స్తుతించుట, కీర్తించుట. అతడు ఏదైనా ఆహారాన్ని భుజింనపుడు “అల్’హందులిల్లాహ్” (సకల స్తోత్రములు, పొగడ్తలు, కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి) అంటాడు, అతడు ఏదైనా పానీయము త్రాగినపుడు “అల్’హందులిల్లాహ్” (సకల స్తోత్రములు, పొగడ్తలు, కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి) అంటాడు.