عن عائشة رضي الله عنها زوج النبي صلى الله عليه وسلم عن النبي صلى الله عليه وسلم قال:
«إِنَّ الرِّفْقَ لَا يَكُونُ فِي شَيْءٍ إِلَّا زَانَهُ، وَلَا يُنْزَعُ مِنْ شَيْءٍ إِلَّا شَانَهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2594]
المزيــد ...

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రజియల్లాహు అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖించారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ విషయం లోనైనా సౌమ్యత, దయ, కనికరం కలిగి ఉండటమనేది దానిని మరింత అలంకృతం చేస్తుంది. అలాగే ఏ విషయంలో నుండి అయినా వీటిని తొలిగించి వేస్తే అది లోపభూయిష్టం అవుతుంది.”

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2594]

వ్యాఖ్యానము

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మాటలలో మరియు ఆచరణలలో సౌమ్యత, దయ, కనికరం, నిదానం – ఇవి విషయాలను మంచివిగా చేస్తాయి, సౌందర్యవంతం చేస్తాయి, పరిపూర్ణం చేస్తాయి, ఆకర్షణీయంగా చేస్తాయి. వీటిని ఆచరించే వ్యక్తి (సమాజములో) వీటి అవసరాన్ని పసిగట్ట వచ్చు.
ఏ విషయం లోనైనా దయ, కరుణ, సౌమ్యత లేక పోవడం దానిని నికృష్టంగానూ, వికారంగానూ మారుస్తుంది. అవి లేని వ్యక్తి వాటి అవసరాన్ని అంత త్వరగా, తేలికగా గుర్తించడు. గుర్తించినా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తరువాత గుర్తిస్తాడు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఈ హదీసులో వ్యక్తులు దయ, కరుణ, నిదానం, సౌమ్యత కలిగి ఉండాలనే హితబోధ ఉన్నది.
  2. సౌమ్యత, కరుణ, మరియు దయాపూరిత వ్యవహారం, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సౌందర్యవంతం చేస్తాయి. ఈ లక్షణాలు ఈ ప్రాపంచిక జీవితంలోనూ, పరలోక జీవితంలోనూ అతనికి లభించే ప్రతి శుభానికీ కారణం అవుతాయి.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (64)
ఇంకా