عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قالَ:
«لاَ يُؤْمِنُ أَحَدُكُمْ، حَتَّى يُحِبَّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 13]
المزيــد ...
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 13]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు – ఒక ముస్లిం, తాను తన స్వయం కొరకు దేనినైతే (ఏఏ విషయాలనైతే) ఇష్టపడతాడో, దానినే (ఆ విషయాలనే) తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడనంతవరకు – తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. అంటే ఉదాహరణకు: అల్లాహ్’కు విధేయత చూపే ఆచరణలలో, ధార్మిక జీవనానికి సంబంధించి మరియు ప్రాపంచిక జీవనానికి సంబంధించి వివిధ రకాల సత్కార్యాలు చేయుట – మొదలైన వాటిలో తన కొరకు ఏమైతే ఇష్టపడతాడో, తన సోదరుని కొరకు కూడా దానినే ఇష్టపడనంత వరకు; అలాగే తన స్వయం కొరకు దేనినైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, తన సోదరుని కొరకు కూడా దానిని ఇష్టపడనంత వరకు తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. ఒకవేళ అతడు తన సోదరునిలో – ధార్మిక విషయాలలో అంటే అల్లాహ్’కు విధేయత చూపుటలో ఏమైనా లోపాలు, కొరత గమనించినట్లయితే అతడు ఆ లోపాలను, కొరతను తొలగించడానికి పాటుపడతాడు; తన సోదరునిలో ఏమైనా మంచిని గమనించినట్లయితే అతడిని ప్రోత్సహిస్తాడు, మార్గదర్శకం చేస్తాడు; ధార్మిక జీవనానికి, ప్రాపంచిక జీవనానినికి సంబంధించిన విషయాలలో అతనికి మంచి సలహాలు ఇస్తాడు.