+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَحَاسَدُوا، وَلَا تَنَاجَشُوا، وَلَا تَبَاغَضُوا، وَلَا تَدَابَرُوا، وَلَا يَبِعْ بَعْضُكُمْ عَلَى بَيْعِ بَعْضٍ، وَكُونُوا عِبَادَ اللهِ إِخْوَانًا الْمُسْلِمُ أَخُو الْمُسْلِمِ، لَا يَظْلِمُهُ وَلَا يَخْذُلُهُ، وَلَا يَحْقِرُهُ التَّقْوَى هَاهُنَا» وَيُشِيرُ إِلَى صَدْرِهِ ثَلَاثَ مَرَّاتٍ «بِحَسْبِ امْرِئٍ مِنَ الشَّرِّ أَنْ يَحْقِرَ أَخَاهُ الْمُسْلِمَ، كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حَرَامٌ، دَمُهُ، وَمَالُهُ، وَعِرْضُهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2564]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఒకరిపై మరొకరు ఈర్ష్య పడకండి, ఒకరి కోసం మరొకరు కావాలని ధరలను కృత్రిమంగా పెంచకండి, ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరికొకరు దూరం కాకండి, వ్యాపారంలో ఒకరి లావాదేవీలను మరొకరు భంగపరచకండి. బదులుగా, అల్లాహ్ యొక్క దాసులుగా సోదర భావంతో ఉండండి. ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు: అతనికి అన్యాయం చేయడు, అతనికి అవసరమైనప్పుడు సహాయం చేయకుండా నిరాకరించడు, అతడిని మోసగించడు, అతడిని అవమానించడు. "నిజమైన తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తి) ఇక్కడ ఉంది" అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ఛాతీ వైపు మూడుసార్లు సూచించారు. ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని ధిక్కరించడం, అవమానించడం చాలా చెడ్డ పని. ఒక ముస్లింపై మరొక ముస్లిం కొరకు నిషేధించబడిన విషయాలు - అతని ప్రాణం, ఆస్తి మరియు గౌరవం."

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2564]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముస్లింలు తమ తోటి ముస్లిం సోదరులతో మంచిగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు మరియు తోటివారి పట్ల వారు పాటించవలసిన కొన్ని విధులు మరియు మర్యాదలను స్పష్టం చేసినారు. వాటిలో కొన్ని: మొదటి ఉపదేశం: "మీరు ఒకరిపై మరొకరు ఈర్ష్యపడకండి" — అంటే, మీరు మీ తోటి సహోదరులు పొందుతున్న ఆనందాన్ని, సంపదను కోల్పోవాలని కోరుకోకండి. రెండవ ఉపదేశం: "మీరు నజష్ (కృత్రిమ బిడ్డింగ్) చేయకండి" - అంటే, ఒక వస్తువు ధరను కృత్రిమంగా పెంచకండి - వాస్తవంగా దానిని కొనాలనే ఆలోచన అతనికి లేకపోయినా, కేవలం విక్రేతకు ప్రయోజనం కలిగించడానికో లేదా కొనుగోలుదారుకు నష్టం కలిగించడానికో ధరను పెంచడం. మూడవ ఉపదేశం: "మీరు ఒకరినొకరు ద్వేషించకండి" - అంటే, ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశ్యన్ని కలిగి ఉండకండి. ఇది ప్రేమాభిమానాలకు విరుద్ధమైనది. అయితే, అల్లాహ్ కోసం (అధర్మాన్ని, అనైతికతను, అన్యాయాన్ని) ద్వేషించడం ఆవశ్యకం. నాల్గవది: మీ సోదరుడికి వెన్ను చూపకండి, అతనిని పట్టించుకోకుండా మరియు అతనిని విడిచిపెట్టి, అతనికి మీ వీపు చూపకండి (అతనితో సంబంధాలు త్రెంచుకోకండి). ఐదవ ఉపదేశం: "మీరు ఒకరి అమ్మకంపై మరొకరు అమ్మకం చేయకండి" - అంటే, ఎవరైనా ఒక వస్తువును కొన్న వ్యక్తితో "ఈ వస్తువు నా దగ్గర ఉంది, ఇంకా తక్కువ ధరకు లేదా మెరుగైన నాణ్యతతో ఇస్తాను" అని చెప్పడం. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సమగ్రమైన ఉపదేశం చేశారు: "మీరు సోదరుల వలే ఉండండి - పైన పేర్కొన్న నిషేధించిన పనులను వదిలేసి, ప్రేమ, ఆప్యాయత, కరుణ, మృదుత్వం మరియు మంచి పనులలో సహకారం చూపించండి. హృదయాలను పరిశుభ్రంగా ఉంచుకుని, ప్రతి స్థితిలో ఒకరికొకరు శ్రేయోభిలాషిగా ఉండండి." ఈ సోదరభావానికి అవసరమైన వాటిలో కొన్ని ఇవే: తన తోటి ముస్లిం సహోదరుడికి అన్యాయం చేయకూడదు, అతనిపై దాడి చేయకూడదు. తన తోటి ముస్లిం సహోదరుడు అన్యాయానికి గురై ఉన్నప్పుడు, అతనికి సహాయం చేయగలిగే స్థితిలో ఉండినా సహాయం చేయకుండా వదలకూడదు; అతనిపై జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు ప్రామాణికంగా తోడ్పడాలి. తన తోటి ముస్లిం సహోదరుణ్ని తక్కువగా చూడకూడదు, అతడిని అగౌరవంగా చూసి అవమానించకూడదు. ఇది మనసులో ఉన్న గర్వం వల్ల కలిగే మానసిక వైఖరి. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు స్పష్టంగా ఇలా పలికినారు: "తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తులు) హృదయంలో ఉంటుంది." అంటే – ఒక మనిషి హృదయంలో తఖ్వా ఉంటే – అతను ఎప్పుడూ తన తోటి ముస్లిం సహోదరుణ్ని తక్కువగా చూడడు. ఒక ముస్లిం తన తోటి సోదరుడిని అవమానించడమే అతని హృదయంలోని అహంకారానికి సాక్షి, ఇది చాలా చెడ్డ గుణాలలో ఒకటి. ఈ గర్వం మనిషిని చెడు నడవడిలోకి నడిపిస్తుంది, ఇది తఖ్వాకు విరుద్ధం. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు చెప్పిన విషయాన్ని మరింత బలంగా నిర్ధారిస్తూ ఇలా పలికినారు: "ఒక ముస్లిం కొరకు, మరో ముస్లింపట్ల మూడు విషయాలు హరామ్ (నిషిద్ధం): అతని రక్తం – అంటే అతనిని చంపడం, తీవ్రంగా గాయపడే విధంగా కొట్టడం, దెబ్బతీయడం వంటి హింసాత్మక చర్యలు చేయడం. ఆతని సంపద – అతనికి చెందని ధనాన్ని అన్యాయంగా తీసుకోవడం, చీటింగ్ చేయడం, దోచుకోవడం. ఆతని గౌరవం – అతని వ్యక్తిగతాన్నీ, వంశాన్నీ, వ్యక్తిత్వాన్నీ నిందించడం, తక్కువగా మాట్లాడడం. ఇవి అన్నీ నిషిద్ధమైన పాపాలు, ఎందుకంటే ముస్లిం సహోదరుల మధ్య స్నేహం, గౌరవం మరియు రక్షణ ఉండాలి.

من فوائد الحديث

  1. విశ్వాసంలో సోదరభావం కొరకు అవసరమైనవన్నీ ఆజ్ఞాపించడం మరియు దానికి విరుద్ధమైన అన్ని మాటలు మరియు చర్యలను నిషేధించడం.
  2. తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తులు) యొక్క ముఖ్యాంశము ఏమిటంటే, హృదయంలో అల్లాహ్‌ను గురించి జ్ఞానం, ఆయన పట్ల భయభక్తులు మరియు ఆయన్ని ఎల్లప్పుడు గమనిస్తున్న భావన కలిగి ఉండటం. ఈ తఖ్వా నుండే సత్కార్యాలు ఉద్భవిస్తాయి.
  3. బయటికి కనిపించే విపరీత ప్రవర్తన, హృదయంలో తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తులు) తగ్గిపోయిందని సూచిస్తుంది.
  4. ఒక ముస్లింను మాటలతోగానీ, పనులతోగానీ లేదా ఇతర ఏ విధంగా గానీ హాని కలిగించడం, బాధపెట్టడం నిషిద్ధం (హరామ్).
  5. ఒక ముస్లిం ఇతరులలోని మంచి లక్షణాలు తనలో కూడా ఉండాలని కోరుకోవడం మరియు ఇతరుల నుండి ఆ మంచి లక్షణాలు తొలగిపోవాలని కోరుకోకపోవడం అసూయ (హసద్) కాదు. ఇలాంటి సహజ కోరికను "గిబ్తా" (సానుకూలమైన అసూయ) అంటారు. ఇది అనుమతించబడినది మరియు మంచి పనుల వైపు ప్రేరేపిస్తుంది.
  6. మనిషి సహజంగా ఇతరులు తనకంటే ఎక్కువగా మంచి గుణాలు కలిగి ఉండటాన్ని ఇష్టపడడు. అయితే, అతడు ఇతరులలోని మంచి గుణాలు తగ్గిపోవాలని కోరుకుంటే, అది చెడ్డ అసూయ (హసద్) అవుతుంది. కానీ తాను కూడా అలాంటి మంచి గుణాలు కలిగి ఉండాలని కోరుకుంటే, అది మంచి అసూయ (గిబ్తా) అవుతుంది మరియు ఇది అనుమతించబడింది.
  7. ఒక ముస్లిం తన సోదరుడి అమ్మకానికి ఆటంకం కలిగించే విధంగా కాకుండా, కొనుగోలుదారుకు అతను ఎదుర్కొన్న పెద్ద మోసాన్ని గురించి హెచ్చరించడం తప్పు కాదు. ఇది నిజాయితీగా సలహా ఇవ్వడం అవుతుంది - కానీ ఇక్కడ ఉద్దేశ్యం కేవలం కొనుగోలుదారుని రక్షించడం మాత్రమే కావాలి, అమ్ముతున్న వాడికి నష్టం కలిగించడం కాకూడదు. మరియు ప్రతి పని సంకల్పాన్ని అనుసరించే ఉంటుంది.
  8. ఇద్దరు పరస్పరం లావాదేవీ కుదుర్చుకోకుండా, ధర కూడా ఖరారు చేయకుండా ఉంటే, అలాంటి సందర్భంలో ఒక ముస్లిం మరొక ముస్లిం జరుపుతున్న లావాదేవీలో జోక్యం చేసుకుని తన అమ్మకాన్ని జరిపితే అది నిషేధించబడిన అమ్మక పద్ధతిగా పరిగణించబడదు.
  9. హదీథులో నిషేధించిన ద్వేషంలో "దైవమార్గంలో ద్వేషం" పరిగణించబడదు. ఎందుకంటే ఇది ముస్లింలకు విధిగావించబడిన పని (ఫర్జ్) మరియు విశ్వాసాన్ని బలపరిచే ముఖ్యమైన అంశం.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా