عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«السَّاعِي عَلَى الأَرْمَلَةِ وَالمِسْكِينِ، كَالْمُجَاهِدِ فِي سَبِيلِ اللَّهِ، أَوِ القَائِمِ اللَّيْلَ الصَّائِمِ النَّهَارَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5661]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 5661]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఒక వితంతువు - ఆమె భర్త చనిపోయాడు, ఆమె మంచి చెడ్డలు చూడడానికి ఆమె తరఫున ఎవరూ లేరు – అటువంటి వితంతువు యొక్క, మరియు నిరుపేదలు, అక్కరలు గల పేదవారు – ఇటువంటి వారి యొక్క మంచిచెడ్డలు, కేవలం అల్లాహ్ నుంచి మాత్రమే ప్రతిఫలం ఆశిస్తూ, ఎవరైతే చూస్తారో, అందు కొరకు వారిపై ఖర్చు చేస్తారో, అటువంటి వాడు ప్రతిఫలములో అల్లాహ్ మార్గములో జిహాద్ చేసిన వానికి (శ్రమించిన వానికి), లేదా రాత్రుళ్ళు తహజ్జుద్ నమాజులో గడిపినా అలుపు లేకుండా, ఇఫ్తార్ లేకుండా ఉపవాసం పాటించేవానితో సమానం.