عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«بَادِرُوا بِالْأَعْمَالِ فِتَنًا كَقِطَعِ اللَّيْلِ الْمُظْلِمِ، يُصْبِحُ الرَّجُلُ مُؤْمِنًا وَيُمْسِي كَافِرًا، أَوْ يُمْسِي مُؤْمِنًا وَيُصْبِحُ كَافِرًا، يَبِيعُ دِينَهُ بِعَرَضٍ مِنَ الدُّنْيَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 118]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి. ఒక మనిషి ఉదయం విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రానికి అవిశాసిగా మారిపోతాడు; లేక అతడు సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు, ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక లాభం కోసం అతడు తన ధర్మాన్ని అమ్మేస్తాడు”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 118]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసిని మంచి పనులను చేయడం వేగవంతం చేయమని మరియు మంచి పనులు చేయడం అసాధ్యమయ్యే పరిస్థితులు రాకముందే వాటిని వీలైనంత ఎక్కువగా చేయమని ప్రోత్సహిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు అతనిలో సందేహాలను రేకెత్తిస్తాయి, వాటి నుండి అతడి ధ్యానాన్ని మళ్ళిస్తాయి. అతని స్థితి ఎలా ఉంటుందంటే దట్టమైన చీకటి లాగా ఉంటుంది. అటువంటి స్థితిలో సత్యమూ, అసత్యమూ కలగాపులగం అయిపోయి, ప్రజలకు వాటి మధ్య భేదాన్ని కనుగొనుట కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితుల తీవ్రత కారణంగా వ్యక్తి పూర్తిగా అయోమయ పరిస్థితిలో పడిపోయి ఈ లోకంలోని తాత్కాలిక ఆనందాల కోసం తన ధర్మాన్ని వదిలి వేసి, ఉదయం విశ్వాసిగా ఉన్న అతడు, సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతాడు, మరియు సాయంత్రం విశ్వాసిగా ఉన్న అతడు ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు.