+ -

عن أبي هريرة رضي الله عنه أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:
«الرَّجُلُ عَلَى دِينِ خَلِيلِهِ، فَلْيَنْظُر أَحَدُكُم مَنْ يُخَالِل».

[حسن] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 4833]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”

[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 4833]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒక వ్యక్తి తన ప్రవర్తన మరియు అలవాట్లలో తన సన్నిహిత స్నేహితుడిని మరియు సన్నిహిత సహచరుడిని పోలి ఉంటాడు. స్నేహం, నైతికతను, ప్రవర్తనను మరియు చర్యలను ప్రభావితం చేస్తుంది. అందుకని మంచి స్నేహితుడిని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు; ఎందుకంటే మంచి మిత్రుడు తన స్నేహితుడిని విశ్వాసం వైపునకు, సన్మార్గం వైపునకు మంచి మరియు శుభం వైపునకు నడిపిస్తాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الصربية الصومالية الرومانية Малагашӣ Урумӣ Канада الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో మంచి వ్యక్తులను స్నేహితులుగా కలిగి ఉండాలనే ఆదేశము, మరియు చెడు వ్యక్తుల సాంగత్యము పట్ల నిషేధము ఉన్నాయి.
  2. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నేహితుడిని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు; మీ సోదరుని గురించో, లేక బంధువుని గురించో పేర్కొనలేదు. ఎందుకంటే, మీరు సహచరుడిని, స్నేహితుడిని ఎంచుకో గలరు, కానీ మీ సోదరుడు లేదా బంధువు విషయములో మీకు ఎంపిక చేసుకునే అవకాశం లేదు.
  3. సన్నిహిత మిత్రుని ఎంచుకోవడం అనేది, జాగ్రత్తగా అన్ని విధాలా ఆలోచించిన మీదట తీసుకునే నిర్ణయం పైనే జరగాలి.
  4. ఒక వ్యక్తి విశ్వాసులతో సహవాసం చేయడం ద్వారా తన ధర్మాన్ని బలపరుచుకుంటాడు, మరియు అనైతిక వ్యక్తులతో, దుష్టులు, దుర్మార్గులతో సహవాసం చేయడం ద్వారా దానిని బలహీన పరుచుకుంటాడు.
ఇంకా