ఉప కూర్పులు

హదీసుల జాబితా

“ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
‘ఒక ముస్లింకి మరొక ముస్లిం పై ఆరు హక్కులు ఉన్నాయి. ‘ఒకటి అతన్ని కలిసినప్పుడు సలాం చేయాలి, రెండు : అతను నిన్ను ఆహ్వానించినప్పుడు దాన్ని స్వీకరించాలి. మూడు : అతను నిన్ను సలహా కోరితే అతనికి మేలైన సలహా ఇవ్వాలి. నాలుగు : తుమ్మినప్పుడు అల్హందులిల్లాహ్ పలికితే దానికి యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పాలి. ఐదు : అతను జబ్బు పడినప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు వెళ్ళి పరామర్శించాలి. ఆరు : చనిపోయినప్పుడు అతని జనాజా వెంట వెళ్ళాలి
عربي ఇంగ్లీషు ఉర్దూ