عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ سِتٌّ» قِيلَ: مَا هُنَّ يَا رَسُولَ اللهِ؟، قَالَ: «إِذَا لَقِيتَهُ فَسَلِّمْ عَلَيْهِ، وَإِذَا دَعَاكَ فَأَجِبْهُ، وَإِذَا اسْتَنْصَحَكَ فَانْصَحْ لَهُ، وَإِذَا عَطَسَ فَحَمِدَ اللهَ فَسَمِّتْهُ، وَإِذَا مَرِضَ فَعُدْهُ وَإِذَا مَاتَ فَاتَّبِعْهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2162]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"‘ఒక ముస్లింకి మరొక ముస్లిం పై ఆరు హక్కులు ఉన్నాయి. ‘ఒకటి అతన్ని కలిసినప్పుడు సలాం చేయాలి, రెండు : అతను నిన్ను ఆహ్వానించినప్పుడు దాన్ని స్వీకరించాలి. మూడు : అతను నిన్ను సలహా కోరితే అతనికి మేలైన సలహా ఇవ్వాలి. నాలుగు : తుమ్మినప్పుడు అల్హందులిల్లాహ్ పలికితే దానికి యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పాలి. ఐదు : అతను జబ్బు పడినప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు వెళ్ళి పరామర్శించాలి. ఆరు : చనిపోయినప్పుడు అతని జనాజా వెంట వెళ్ళాలి
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2162]
ఒక ముస్లిం మీద మరో ముస్లిం హక్కులు ఆరు ఉన్నాయని ప్రవక్త ﷺ స్పష్టం చేసినారు. అవి: మొదటి హక్కు: ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కలిసినప్పుడు, "అస్సలాము అలైకుం" (మీపై శాంతి ఉండుగాక) అని సలాం చెప్పాలి. దానికి అతను కూడా "వఅలైకుమ్ అస్సలాం" (మీపై కూడా శాంతి ఉండుగాక) అని జవాబు ఇవ్వాలి. రెండవ హక్కు: ఒక ముస్లిం తన సహోదరుడిని వలీమా (విందు) లేదా ఇతర (ధర్మబద్ధమైన) శుభకార్యాలకు పిలిస్తే, ఆ ఆహ్వానాన్ని స్వీకరించి, హాజరు కావాలి. మూడవ హక్కు: సోదరుడు సలహా అడిగితే, నిజాయితీగా, దొంగదనమూ లేకుండా, మోసం చేయకుండా అతనికి మంచి సలహా ఇవ్వాలి. నాల్గవ హక్కు: ఒక ముస్లిం తుమ్మినప్పుడు, అతడు "అల్‌హమ్దు లిల్లాహ్" (అల్లాహ్ కే సకల స్తుతులు) అని పలకాలి. అప్పుడు నీవు అతనికి "యర్హముకల్లాహ్" (అల్లాహ్ నీపై దయజూపుగాక) అని చెప్పాలి. ఆయన కూడా దానికి ప్రతిగా "యహ్దీకుముల్లాహ్ వయుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గదర్శనం చేయుగాక, మీ పరిస్థితిని మంచిగా మార్చుగాక) అని చెప్పాలి. ఐదవ హక్కు: ఒక ముస్లిం అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతడిని పరామర్శించాలి, అతడి ఆరోగ్యం కోసం దుఆ చేయాలి. ఆరవ హక్కు: ఒక ముస్లిం మరణిస్తే, అతడి జనాజా పాల్గొనాలి, అతడి పై జనాజా నమాజ్ చేయాలి, అతడిని సమాధిలో ఉంచే వరకూ అతడి జనాజా వెంట వెళ్లాలి.