عن أبي صرمة رضي الله عنه مرفوعاً: «من ضارَّ مسلما ضارَّه الله، ومن شاقَّ مسلما شقَّ الله عليه».
[حسن] - [رواه أبوداود والترمذي وابن ماجه وأحمد]
المزيــد ...

అబూ సిర్మత రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం’ముస్లిం ను నష్టానికి గురిచేసిన వాడిని అల్లాహ్ నష్టానికి గురిచేస్తాడు,ముస్లిం తో కఠినంగా వ్యవహరించినవాడితో అల్లాహ్ కఠినంగా వ్యవహరిస్తాడు.
ప్రామాణికమైనది - దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు

వివరణ

ముస్లిమును బాధించడాన్ని,నష్టం కలిగించడాన్ని హానీ కలిగించడాన్ని అది ముస్లిం శరీరం, కుటుంబం, ఆస్తి లేదా పిల్లలకు అయినాసరే నిషేదించబడినదని ఈ హదీసు సాక్ష్యపరుస్తూ దృవీకరిస్తుంది,ముస్లింకు ఎవరైనా హాని కలిగించిన లేదా కష్టాలను కలిగించిన అల్లాహ్ అతనికి అదే విధంగా తిరిగి చెల్లిస్తాడు, హాని అనేది లాభం కోల్పోవడం లేదా ఇతర ఏ విధమైన నష్టాన్ని కలిగించవచ్చు,ఉదాహరణకు,లావాదేవీలలో మోసానికి పాల్పడటం,లోపాలను దాచడం మరియు ఒక ముస్లిం ఇప్పటికే పెళ్లి సందేశం ప్రతిపాదించిన ఒక మహిళకు ప్రతిపాదించడం లాంటివి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ముస్లిముకు ఏ రకమైన హనీ కలిగించడం కూడా నిషేదమే!
  2. చేసిన కార్యానికి ప్రతి ఫలితం తగిన విధంగా లభిస్తుంది{కార్యానుగుణంగా ప్రతిఫలం సిద్దిస్తుంది}
  3. అల్లాహ్ యొక్క సంరక్షణ తన ముస్లిము దాసులకు కొరకు ఉన్నది,స్వయంగా ఆ పరమపవిత్రుడు వారిని రక్షిస్తాడు
ఇంకా