عَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ، فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَقَوْمٍ نَزَلُوا فِي بَطْنِ وَادٍ، فَجَاءَ ذَا بِعُودٍ، وَجَاءَ ذَا بِعُودٍ، حَتَّى أَنْضَجُوا خُبْزَتَهُمْ، وَإِنَّ مُحَقَّرَاتِ الذُّنُوبِ مَتَى يُؤْخَذْ بِهَا صَاحِبُهَا تُهْلِكْهُ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 22808]
المزيــد ...
సహల్ ఇబ్నె సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి. చిన్న చిన్న పాపాల ఉదాహరణ — కొంతమంది ఒక లోయలో దిగారు. వారిలో ఒకతను ఒక చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇంకొకతను మరో చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇలా అందరూ కలిపి కట్టేలను పోగుచేసి తమ రొట్టెలను కాల్చుకున్నారు (అంటే, పెద్ద మంటను వెలిగించారు). అలాగే, చిన్న చిన్న పాపాలు కూడా
ఒకచోట పోగవుతుంటే, అవి అతన్ని నాశనం చేస్తాయి."
[దృఢమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 22808]
చిన్న చిన్న పాపాలు చేయడంలో మెతకదనం చూపవద్దని, వాటిని తరచుగా చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఎందుకంటే అవన్నీ నాశనానికి దారితీస్తాయి. ఒక లోయలో విడిది చేసిన వ్యక్తుల ఉదాహరణను ఆయన ఇచ్చారు. అక్కడి ప్రతి ఒక్కరూ ఒక చిన్న కట్టెను తీసుకు వచ్చారు, అలా వారు ఆ కట్టెలను తమ రొట్టెలు కాల్చేందుకు అవసరమైనంతగా జమ చేసి పెద్ద మంట రాజేసినారు. అలాగే చిన్న చిన్న పాపాలు చేసిన వ్యక్తి వాటిలో చిక్కుకోకుండా, వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాప పడకపోతే, అల్లాహ్ అతడిని క్షమించకపోతే, అవన్నీ అతడిని నాశనం చేస్తాయి.