عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لاَ يَزَالُ قَلْبُ الكَبِيرِ شَابًّا فِي اثْنَتَيْنِ: فِي حُبِّ الدُّنْيَا وَطُولِ الأَمَلِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6420]
المزيــد ...
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“ఒక వృద్ధుని హృదయం రెండు విషయాలలో యవ్వనంగా ఉంటుంది, ప్రపంచం పట్ల అతని ప్రేమ (అంటే దాని సంపద, వినోదం మరియు విలాసాలు) మరియు అతని నిరంతర ఆశ."
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6420]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఒక వృద్ధుడు వృద్ధాప్యములో పెరుగుతూ ఉంటాడు, అతని శరీరం బలహీనపడుతుంది, కానీ అతని హృదయం రెండు విషయాల పట్ల ప్రేమలో యవ్వనంగా ఉంటుంది: మొదటిది: సంపదను కూడబెట్టడం ద్వారా ఈ ప్రపంచముపై ప్రేమ; రెండవది: దీర్ఘాయువు, ఆయుర్దాయం, నిరంతర జీవితం మరియు శాశ్వతమైన ఆశలు.