عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«بَدَأَ الْإِسْلَامُ غَرِيبًا، وَسَيَعُودُ كَمَا بَدَأَ غَرِيبًا، فَطُوبَى لِلْغُرَبَاءِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 145]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఇస్లాం మొదట్లో పరాయిగా (అన్యంగా, అపరిచితంగా) ప్రారంభమైంది. ఇది మళ్లీ మొదట్లో ఉన్నట్లుగానే పరాయిగా మారిపోతుంది. కాబట్టి, (దానిని గట్టిగా పట్టుకుని ఉండేవారికి) పరాయివారికి శుభం కలుగుగాక!"
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 145]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రారంభంలో ఇస్లాం ధర్మాన్ని కొద్దిమంది మాత్రమే అనుసరించేవారు, ఆ తొలికాలంలో ఇస్లాం ధర్మం అనేది పరాయిగా (అపరిచితమైనదిగా) ఉండేది. భవిష్యత్తులో కూడా, దాన్ని నిజంగా పాటించేవారు చాలా తక్కువ అయిపోతారు, అంటే ఇస్లాం మళ్లీ ఆ పరాయితన అపరిచిత స్థితికి చేరుకుంటుంది. అందుకే, అలాంటి పరాయితన స్థితిలో కూడా దానిని అనుసరిస్తూ, ఇస్లాంను గట్టిగా పట్టుకున్నవారికి శుభం, అభినందన, ఆనందం, హర్షం కలుగుగాక!"