عَنْ عَلِيٍّ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ أَصَابَ حَدًّا فَعُجِّلَ عُقُوبَتَهُ فِي الدُّنْيَا فَاللَّهُ أَعْدَلُ مِنْ أَنْ يُثَنِّيَ عَلَى عَبْدِهِ العُقُوبَةَ فِي الآخِرَةِ، وَمَنْ أَصَابَ حَدًّا فَسَتَرَهُ اللَّهُ عَلَيْهِ وَعَفَا عَنْهُ فَاللَّهُ أَكْرَمُ مِنْ أَنْ يَعُودَ فِي شَيْءٍ قَدْ عَفَا عَنْهُ».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2626]
المزيــد ...
అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో శిక్షించబడతాడో, అల్లాహ్ ఎంతటి న్యాయవంతుడు అంటే అల్లాహ్ అతనికి పరలోకములో రెండవసారి శిక్ష విధించడు; అలాగే ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; అల్లాహ్ దానిని ఇహలోకములో అతని కొరకు కప్పివేసి, దానిని క్షమించి వేసాడో, అల్లాహ్ ఎంతటి దయగలవాడు అంటే తాను అప్పటికే క్షమించిన దానిని, పరలోకములో తిరిగి వెలికి తీయడు.
[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 2626]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియఏస్తున్నారు: ‘షరియత్’లో నిర్దిష్టమైన శిక్షలు నిర్ణయించబడిన పాపములలో (ఉదా: దొంగతనము, వ్యభిచారము మొ.) ఎవరైనా ఏదైనా పాపము చేసి ఉండి, ఆ పాపానికి అతడు ఈ లోకములో శిక్షించబడితే, ఆ శిక్ష అతని ఆ పాపాన్ని తొలగిస్తుంది; మరియు ఆ పాపానికి పరలోకములో శిక్షనుండి విముక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే ఒకే పాపానికి రెండు శిక్షలు విధించడు; మరియు అల్లాహ్ ఈ లోకములో ఎవరి పాపాన్నైనా కప్పివేసి ఉండి, అతడిని మన్నించి, క్షమించి ఉన్నట్లైతే, మరియు అతడు ఆ పాపానికి ఈ లోకములో శిక్షించబడకపోయినట్లైతే, అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే తాను అప్పటికే మన్నించి, క్షమించివేసిన పానికి పరలోకములో తిరిగి శిక్ష విధించడు.