عَن الحَسَنِ قال: حَدَّثنا جُنْدَبُ بْنُ عَبْدِ اللَّهِ رضي الله عنه، فِي هَذَا المَسْجِدِ، وَمَا نَسِينَا مُنْذُ حَدَّثَنَا، وَمَا نَخْشَى أَنْ يَكُونَ جُنْدُبٌ كَذَبَ عَلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلّى الله عليه وسلم:
«كَانَ فِيمَنْ كَانَ قَبْلَكُمْ رَجُلٌ بِهِ جُرْحٌ، فَجَزِعَ، فَأَخَذَ سِكِّينًا فَحَزَّ بِهَا يَدَهُ، فَمَا رَقَأَ الدَّمُ حَتَّى مَاتَ، قَالَ اللَّهُ تَعَالَى: بَادَرَنِي عَبْدِي بِنَفْسِهِ، حَرَّمْتُ عَلَيْهِ الجَنَّةَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3463]
المزيــد ...
హసన్ ఉల్లేఖనం ఆయన ఇలా పలికినారు: జుందుబ్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఈ మస్జిదులో దీనిని మాకు తెలియపరచారు. ఆయన మాకు తెలియపరచినప్పటి నుండి మేము దీనిని మరిచిపోలేదు మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో జుందుబ్ అబద్ధం చెబుతాడనే భయం కూడా మాకు లేదు. అతడి పలుకులు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
మీకు పూర్వం జీవించినవారిలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకొనగా, ఆ రక్తస్రావంతో మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించినాడు: "నా దాసుడు తన మరణం విషయంలో త్వరపడినాడు; అందువలన నేను అతని కొరకు స్వర్గాన్ని నిషేధించాను."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3463]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: పూర్వకాలంలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు బాధకు తట్టుకోలేక, సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకున్నాడు. దాని వలన రక్తస్రావం ఆగక, చివరకు అతడు మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికినాడు: "నా దాసుడు తన మరణాన్ని త్వరగా తెచ్చుకున్నాడు; కాబట్టి నేను అతనికి స్వర్గాన్ని నిషేధించాను."