+ -

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَثَلُ القَائِمِ عَلَى حُدُودِ اللَّهِ وَالوَاقِعِ فِيهَا، كَمَثَلِ قَوْمٍ اسْتَهَمُوا عَلَى سَفِينَةٍ، فَأَصَابَ بَعْضُهُمْ أَعْلاَهَا وَبَعْضُهُمْ أَسْفَلَهَا، فَكَانَ الَّذِينَ فِي أَسْفَلِهَا إِذَا اسْتَقَوْا مِنَ المَاءِ مَرُّوا عَلَى مَنْ فَوْقَهُمْ، فَقَالُوا: لَوْ أَنَّا خَرَقْنَا فِي نَصِيبِنَا خَرْقًا وَلَمْ نُؤْذِ مَنْ فَوْقَنَا، فَإِنْ يَتْرُكُوهُمْ وَمَا أَرَادُوا هَلَكُوا جَمِيعًا، وَإِنْ أَخَذُوا عَلَى أَيْدِيهِمْ نَجَوْا، وَنَجَوْا جَمِيعًا».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2493]
المزيــد ...

అన్’ను’మాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
అల్లాహ్ నిర్దేశించిన హద్దులలో నిలిచి ఉండేవారి, మరియు వాటి లోపలే ఉండిపోయేవారి ఉపమానం ఓడపై (ఎక్కే ముందు పై అంతస్థులో ఎవరు ఉండాలి అని) లాటరీ వేయువాని వంటిది. అలా కొందరు ఓడ పై అంతస్థులో ఉంటారు, కొందరు ఓడ క్రింది అంతస్థులో ఉంటారు. త్రాగు నీటి కొరకు క్రింది అంతస్థులోని వారు పై అంతస్థుకు వెళ్ళినపుడు అక్కడ ఉన్నవారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. దానితో వారు (క్రింది అంతస్తు వారు) ఇలా అన్నారు “ఓడలో మనం ఉంటున్న భాగములోనే ఒక రంధ్రము చేస్తే (త్రాగు నీటి కొరకు) మన పై ఉంటున్నవారికి ఇబ్బంది కలిగించము కదా”. ఒకవేళ వారిని (క్రింది అంతస్తు వారిని) వారు కోరిన విధంగా చేయడానికి వదిలేస్తే, అందరూ మునిగిపోతారు. ఒకవేళ దానిని (విషయాన్ని ఆపితే) తమ చేతులలోనికి తీసుకుంటే వారితో పాటు అందరూ రక్షింపబడతారు.

[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 2493]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ విధించిన హద్దులలో నిలిచి ఉండే వారిని గురించి, అల్లాహ్ యొక్క ఆదేశాలపై స్థిరంగా ఉండే వారిని గురించి, మంచిని చేయమని ఆదేశించే వారి గురించి మరియు చెడును నిషేధించే వారి గురించి ఒక (అద్భుతమైన) ఉపమానం ద్వారా వివరిస్తున్నారు. అల్లాహ్ విధించిన హద్దులలో స్థిరంగా నిలిచి ఉండేవారి; మరియు సత్కార్యాలు చేయుటను వదిలి వేసి, దుష్కార్యాలకు, దుర్మార్గానికి పాల్బడేవారి – మరియు వారి కారణంగా సమాజపు ముక్తి మరియు రక్షణలపై పడే ప్రభావముల యొక్క ఉపమానము ఎటువంటిదంటే – ఓడ లోనికి ఎక్కే ముందు ఎవరు ఓడ పై అంతస్థులో కూర్చోవాలి, మరియు ఎవరు ఓడ క్రింది అంతస్థులో కూర్చోవాలి అని లాటరీ వేసుకున్న ప్రజలవంటిది. వారిలో కొందరు ఓడ పై భాగాన కూర్చోవడాన్ని గెలుచుకున్నారు, మరి కొందరు ఓడ క్రింది భాగములో కూర్చోవడాన్ని గెలుచుకున్నారు. క్రింది భాగాన కూర్చొన్న వారు త్రాగు నీటి కొరకు పై భాగానికి వెళ్ళినపుడు, అక్కడ ఉన్న వారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. అందుకని క్రింది భాగములో కూర్చొన్నవారు ఇలా అనుకున్నారు: “ఒకవేళ మనం ఉంటున్న క్రింది భాగములోనే ఒక రంధ్రము చేసుకుంటే, మన పైన ఉన్న వారికి కష్టం కలిగించకుండా అందులో నుంచే మనం నీటిని తీసుకోవచ్చు; ”. ఒకవేళ పైన ఉన్నవారు, క్రింద ఉన్న వారిని అలా చేయడానికి వదిలివేస్తే, వారందరితో పాటు ఓడ పూర్తిగా మునిగి పోతుంది. ఒకవేళ వారు (పైన ఉన్నవారు) లేచి నిలబడి వారిని అలా చేయకుండా వారించి, వారిని అడ్డుకుంటే, అక్కడున్న రెండు సమూహాలు కూడా రక్షించబడతాయి.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో మంచి చేయమని ఆదేశించడం మరియు చెడును నిషేధించడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.
  2. ఉదాహరణలు మరియు ఉపమానాల ద్వారా విషయాన్ని బోధించే పద్ధతి, విషయం యొక్క అర్థాన్ని, భావాన్ని సాకారంగా మనసుకు అర్థం అయ్యేలా చేస్తుంది.
  3. నిరోధం , హద్దులు లేకుండా బాహాటంగా చేయబడే చెడు అతి ప్రమాదకరం, అది అందరికీ హాని కలుగజేస్తుంది.
  4. దుష్కార్యాలకు, దుర్మాగానికి పాల్బడే వారిని అలాగే వదిలి వేయడం సమాజపు వినాశానికి దారితీస్తుంది. వారు భూమిపై అరాచకత్వాన్ని సృష్టిస్తారు.
  5. చెడు నడత మరియు మంచి సంకల్పము – ఇవి మంచి పని చేయడానికి ఎన్నడూ సరిపోవు.
  6. ముస్లిం సమాజంలో బాధ్యత అనేది పంచుకోబడుతుంది – ఎవరో ఒక్కరిపై మోపబడదు.
  7. ప్రైవేటుగా జరిగే పాపాలు నిరోధించబడకపోతే, అవి ప్రజలకు హింసగా అవుతాయి.
  8. పాపపు పనులకు, దుష్ట కార్యాలకు ఒడిగట్టేవారు కపటులు చేసే మాదిరిగా తమ చెడును సమాజానికి చేస్తున్న మంచిగా చూపిస్తారు.