عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ مِنْ أَعْظَمِ الجِهَادِ كَلِمَةَ عَدْلٍ عِنْدَ سُلْطَانٍ جَائِرٍ».
[حسن لغيره] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 2174]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా జిహాద్’లలో ఉత్తమమైన జిహాద్ ఏమిటంటే కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం.”
[పరా ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 2174]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: అల్లాహ్ మార్గములో చేయు వివిధ రకాల జిహాదులలో, అత్యంత ఉత్తమమైనది, మరియు ప్రయోజనకరమైనది – అన్యాయానికి పాల్బడుతూ ఉండే, కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం – ఎందుకంటే పాలకుని ఎదుట ఆ విధంగా మాట్లాడే వ్యక్తి ‘మంచి చేయమని ఆదేశించండి, చెడును నిషేధించండి’ అనే షరియత్ యొక్క ఆదేశంపై అనుసరించినాడు గనుక; అది అటువంటి పాలకుని ఎదుట నిలబడి మాట్లాడడం అయినా, లేక అతనికి లేఖ ద్వారా తెలియజేయడం అయినా, చర్య ద్వారా అతని అవగతమయ్యేలా చేయడం అయినా – ప్రజలకు లాభాన్ని చేకూర్చే, హానిని నివారించేది ఏదైనా కావచ్చు.