عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«كَتَبَ اللهُ مَقَادِيرَ الْخَلَائِقِ قَبْلَ أَنْ يَخْلُقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِخَمْسِينَ أَلْفَ سَنَةٍ، قَالَ: وَعَرْشُهُ عَلَى الْمَاءِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2653]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టితాలన్నింటి భవితవ్యాన్ని రాసి ఉంచినాడు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “ఆయన సింహాసనం నీటిపై ఉన్నది”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2653]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సృష్ఠితాల భవితవ్యానికి సంబంధించి ఏమి జరుగనున్నది అనేది అల్లాహ్ చాలా విపులంగా రాసాడు; ఉదాహరణకు వాటి జీవిత కాలాన్ని గురించి, వాటి మరణాన్ని గురించి, వాటి ఉపాధి గురించి – ఇలా అనేక విషయాలను గురించి, ఈ ఆకాశాలు, మరియు భూమిని ఆయన సృష్టించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే చాలా వివరంగా రాసి, ‘లౌహ్ అల్ మహ్’ఫూజ్’ లో (భద్రపరుచబడిన ఫలకములో) భద్ర పరిచాడు. ప్రతి విషయమూ ఆయన ఆదేశించిన విధంగానే జరుగుతుంది. ప్రతి విషయము, ప్రతి వస్తువు మొదలైన ప్రతి దాని యొక్క ఉనికి, భవితవ్యము అల్లాహ్ ఇచ్ఛానుసారమే ఉంటుంది. దాసునిపై వచ్చి పడేది ఏదీ అతనిని చేరకుండా ఉండదు, అతనిది కానిది ఏదీ అతనిని ఎన్నటికీ చేరదు.