عن عبدالله بن عباس رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال: «ما من أيام العمل الصالح فيها أحب إلى الله من هذه الأيام» يعني أيام العشر. قالوا: يا رسول الله، ولا الجهاد في سبيل الله؟ قال: «ولا الجهاد في سبيل الله، إلا رجل خرج بنفسه وماله، فلم يَرْجِعْ من ذلك بشيء»
[صحيح] - [رواه البخاري، وهذا لفظ أبي داود وغيره]
المزيــد ...

అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు: మిగతా రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో (అంటే జీల్ హిజ్జా యొక్క మొదటి పదిరోజుల్లో) చేసే సత్కార్యాలు అల్లాహ్ కు అత్యంత ప్రీతిపూర్వకమైనవి,దానికి అనుయాయులు ‘ఓ దైవప్రవక్త –దైవమార్గంలో జిహాద్ చేయడం కంటే కూడా ఎక్కువా ? అని అడిగారు ప్రవక్త బదులిస్తూ’అవును’కానీ ఒకవేళ ఒక సైనికుడు తన ధన ప్రాణాలతో బయలుదేరి మళ్ళీ వాటితో తిరిగి రానట్లైతే (వీరమరణంపొందితే) మరో విషయం.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

{"ما من أيام العمل الصالح فيها أحب إلى الله من هذه الأيام" }సత్కార్యములు మిగతా రోజుల్లో చేసే సత్కార్యల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు అల్లాహ్ కు అత్యంత ప్రీతిపూర్వకమైనవి” (అంటే జీల్ హిజ్జా యొక్క మొదటి పదిరోజుల్లో) అనుయాయులు ప్రశ్నించారు: ఓ దైవప్రవక్త దైవమార్గంలో జిహాద్ చేయడం కంటే కూడానా? అని అడిగారు ప్రవక్త బదులిస్తూ’అవును’కానీ ఒకవేళ ఒక సైనికుడు తన ధన ప్రాణాలతో బయలుదేరి మళ్ళీ వాటితో తిరిగి రానట్లైతే(వీరమరణంపొందితే) మరో విషయం”- "العمل الصالح"،సత్కార్యములు ‘లో నమాజు సదాఖా ఉపవాసము దైవస్మరణ, తక్బీరు,ఖుర్ఆన్ పారాయణం,తల్లిదండ్రుల పట్ల విధేయత,బంధుత్వకలుపుగోలు,సృష్టితాల పట్ల ఉత్తమ వైఖరి,పొరుగువారితో ఉత్తమ వైఖరి,మొదలగువన్నీ వస్తాయి,అందువల్ల జిల్హిజ్జా మొదటి పదిరోజులు ఉపవాసము పాటించడము ముస్తహబ్బ్ అమలు,ఎందుకంటే ఇది అమలు సాలెహ్ ‘సత్కర్మలో ప్రవేశిస్తుంది,ఈ హదీసులో జిల్హిజ్జా మాసము మొదటి పది రోజులలో సత్కార్యములు చేయాలన్న ఆదేశము ప్రమాణం లభిస్తుంది,మరియు జిహాద్ కార్యాల్లో అత్యుత్తమమైనది అని తెలుస్తుంది,అందువల్ల దైవప్రవక్త అనుయాయులు ప్రవక్తను ప్రశ్నించారు:అల్లాహ్ మార్గములో జిహాద్ చేయడము కంటే కూడానా? మరియు ఇందులో ఈ స్థితి యొక్క ఘనత కూడా తెలియజేయబడినది ఇందులో ఒక వ్యక్తి తన ధన ప్రాణాలతో దైవమార్గములో బయలుదేరుతాడు,మరియు అమరగతిని పొందుతాడు శత్రువు అతని వాహనం మరియు ఆయుధాలను స్వాధీనపర్చుకుంటాడు,దైవమార్గములో తన ప్రాణాలను సైతం అర్పించే ఈ వ్యక్తి అత్యత్తుమ ముజాహిదీనులలో పరిగణించబడతాడు,అయితే ఈ జిహాద్ జీల్హిజ్జా మొదటి పది రోజులలో చేయబడే సత్కర్మల కంటే ఉత్తమమైనది,ఈ జిహాద్ కనుక ఈ పదిరోజులలో జరిగినట్లైతే దాని ఘనత మరింత రెట్టింపు అవుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇతర రోజులకంటే జిల్హిజ్జా మొదటి పదిరోజులకు ఎంతో ఘనత,ప్రాముఖ్యత ఉంది.
  2. జిల్ హిజ్జా యొక్క మొదటి పదిరోజులు ఉపవాసము పాటించడము ముస్తాహబ్బ్ కార్యము.
  3. ఇస్లాం లో జిహాదుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది
  4. కొన్ని రోజులకు మరికొన్ని రోజులపై ఘనత ప్రాధాన్యత కలదు
  5. శ్రోతల మర్యాదల్లో ఒకటి 'అర్ధం కానీ విషయాలను అడిగి తెలుసుకోవడము.
ఇంకా