عَنْ أَبِي نَجِيحٍ العِرْبَاضِ بْنِ سَارِيَةَ رضي الله عنه قَالَ: وَعَظَنَا رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَوْعِظَةً وَجِلَتْ مِنْهَا القُلُوبُ، وَذَرَفَتْ مِنْهَا العُيُونُ، فَقُلْنَا: يَا رَسُولَ اللهِ! كَأَنَّهَا مَوْعِظَةُ مُوَدِّعٍ؛ فَأَوْصِنَا، قَالَ:
«أُوصِيكُمْ بِتَقْوَى اللَّهِ، وَالسَّمْعِ وَالطَّاعَةِ، وَإِنْ تَأَمَّرَ عَلَيْكُمْ عَبْدٌ، فَإِنَّهُ مَنْ يَعِشْ مِنْكُمْ بَعْدِي فَسَيَرَى اخْتِلَافًا كَثِيرًا، فَعَلَيْكُمْ بِسُنَّتِي وَسُنَّةِ الخُلَفَاءِ الرَّاشِدِينَ المَهْدِيينَ، عَضُّوا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُحْدَثَاتِ الأُمُورِ؛ فَإِنَّ كُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».
[صحيح] - [رواه أبو داود والترمذي] - [الأربعون النووية: 28]
المزيــد ...
అబూ నజీహ్ అల్-'ఇర్బాద్ ఇబ్నె సారియా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: "అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక ఉపదేశం చేశారు, దాని వలన మా హృదయాలు భయంతో వణికిపోయాయి మరియు కన్నీళ్లు ప్రవహించాయి. అప్పుడు మేము ఇలా అడిగాము: 'ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇది ఒక వీడ్కోలు ఉపదేశంలా ఉంది, కాబట్టి మాకు ఉపదేశం చేయండి.' అప్పుడు ఆయన ఇలా అన్నారు:
"నేను మీకు అల్లాహ్ పట్ల భయభక్తులను కలిగి ఉండమని, మరియు ఒక బానిస మీపై నాయకుడిగా నియమించబడినప్పటికీ, అతడి మాట వినమని మరియు విధేయత చూపమని ఉపదేశిస్తున్నాను. నిశ్చయంగా, నా తర్వాత మీలో ఎవరైతే జీవిస్తారో, వారు అనేక విభేదాలను చూస్తారు. కాబట్టి, నా సంప్రదాయాన్ని (సున్నత్) మరియు సన్మార్గం పొందిన, సరైన మార్గంలో నడిచిన ఖలీఫాల సంప్రదాయాన్ని మీరు తప్పనిసరిగా అనుసరించండి. వాటిని మీరు కొర పళ్ళతో గట్టిగా పట్టుకోండి. మరియు (ఇస్లాం ధర్మంలో) నూతన కల్పితాల (బిద్అత్) పట్ల మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; ఎందుకంటే, (ఇస్లాం ధర్మంలో) ప్రతి నూతన కల్పితము (బిద్అత్) ఒక మార్గభ్రష్టత."
[ప్రామాణికమైన హదీథు] - [అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:] - [అన్నవవీ నలభై హదీథులు - 28]
ఈ హదీథు ద్వారా తెలుస్తున్న విషయము: తన సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దినము హితబోధ చేసినారు. ఆ హితబోధ అక్కడ ఉన్న వారి హృదయాలను కంపింపజేసింది, వారి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేలా చేసింది. ఆ హితబోధలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన విషయాల గాంభీర్యం, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించిన తీరు చూసి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ ఇది (మీరు చేసిన హితబోధ) శాశ్వతంగా వీడిపోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది”. కనుక తమ కొరకు ఏదైనా ప్రమాణాన్ని, ఆయన తరువాత దానికి కట్టుబడి ఉండేలా ఆదేశించమని కోరినారు. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకోరకు ఇది నా హితబోధ (వసియ్యహ్); అల్లాహ్ వీధి చేసిన విషయాలను ఆచరిస్తూ, ఆయన నిషేధించిన విషయాలకు దూరంగా ఉంటూ, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి.” మాట వినుట మరియు అనుసరించుట: అంటే అమీరుల (పాలకుల) మాట వినుట మరియు వారిని అనుసరించుట అని అర్థము. బానిస అయినా సరే పాలకునిగా నియమించబడినా, లేక వారి విషయాల నియంత్రణ కొరకు నియమించబడినా అతని మాట వినాలి, అతడిని అనుసరించాలి. అంటే మరో మాటలో సృష్టి మొత్తములో అందరి కంటే అధమ స్థాయికి చెందిన వాడు అయినా సరే పాలకునిగా నియమించబడితే దానిని వ్యతిరేకించకండి, అతడిని అనుసరించండి. వ్యతిరేకత వివాదాలను, కలహాలను రేకిత్తిస్తుంది, రెచ్చగొడుతుంది. ఎందుకంటే (నా తరువాత) మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తీవ్రమైన విబేధాలనుండి ఎలా బయటపడాలో వివరించారు – అది తన సున్నత్ ను మరియు తన తరువాత (షరియత్ మార్గదర్శనములో) సన్మార్గ గాములైన ఖలీఫాల సున్నత్ ను; అంటే అబూ బకర్ అస్సిద్దీఖ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరియు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ల సున్నత్ ను అంటి పెట్టుకుని ఉండాలని, దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోవాలని అన్నారు. దీని అర్థం సున్నత్‌కు కట్టుబడి ఉండటం మరియు దానిని అనుసరించడం. ఈ పదాలు ఆ విషయం యొక్క ప్రాముఖ్యత మరియు దాని తీవ్రతను సూచిస్తున్నాయి. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మములో కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే అని హెచ్చరించినారు.