కూర్పు:
+ -

عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قُلْت يَا رَسُولَ اللَّهِ! أَخْبِرْنِي بِعَمَلٍ يُدْخِلُنِي الجَنَّةَ وَيُبَاعِدْنِي مِنْ النَّارِ، قَالَ:
«لَقَدْ سَأَلْتَ عَنْ عَظِيمٍ، وَإِنَّهُ لَيَسِيرٌ عَلَى مَنْ يَسَّرَهُ اللَّهُ عَلَيْهِ: تَعْبُدُ اللَّهَ لَا تُشْرِكُ بِهِ شَيْئًا، وَتُقِيمُ الصَّلَاةَ، وَتُؤْتِي الزَّكَاةَ، وَتَصُومُ رَمَضَانَ، وَتَحُجُّ البَيْتَ، ثُمَّ قَالَ: أَلَا أَدُلُّكَ عَلَى أَبْوَابِ الخَيْرِ، الصَّوْمُ جُنَّةٌ، وَالصَّدَقَةُ تُطْفِئُ الْخَطِيئَةَ كَمَا يُطْفِئُ المَاءُ النَّارَ، وَصَلَاةُ الرَّجُلِ مِنْ جَوْفِ اللَّيْلِ، ثُمَّ تَلَا: {تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} حَتَّى {بَلَغَ يَعْمَلُونَ}، ثُمَّ قَالَ: أَلَا أُخْبِرُك بِرَأْسِ الأَمْرِ وَعَمُودِهِ وَذِرْوَةِ سَنَامِهِ، فَقُلْتُ: بَلَى يَا رَسُولَ اللَّهِ، قَالَ: رَأْسُ الأَمْرِ الإِسْلَامُ، وَعَمُودُهُ الصَّلَاةُ، وَذِرْوَةُ سَنَامِهِ الجِهَادُ، ثُمَّ قَالَ: أَلَا أُخْبِرُك بِمِلَاكِ ذَلِكَ كُلِّهِ، فقُلْت: بَلَى يَا رَسُولَ اللَّه! فَأَخَذَ بِلِسَانِهِ وَقَالَ: كُفَّ عَلَيْك هَذَا، قُلْت: يَا نَبِيَّ اللَّهِ! وَإِنَّا لَمُؤَاخَذُونَ بِمَا نَتَكَلَّمُ بِهِ، فَقَالَ: ثَكِلَتْكَ أُمُّكَ وَهَلْ يَكُبُّ النَّاسَ عَلَى وُجُوهِهِمْ أَوْ قَالَ عَلَى مَنَاخِرِهِمْ إلَّا حَصَائِدُ أَلسِنَتِهِمْ»!

[صحيح] - [رواه الترمذي] - [الأربعون النووية: 29]
المزيــد ...

ముఅద్ ఇబ్నె జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, అతను ఇలా అన్నారు: "నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: 'ఓ రసూలుల్లాహ్ ! నన్ను స్వర్గంలోకి ప్రవేశపెట్టి, నరకం నుండి దూరం చేసే ఒక పని గురించి నాకు తెలియజేయండి.' అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"నిశ్చయంగా, నీవు ఒక గొప్ప విషయం గురించి అడిగావు. అయితే, అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో వారికి అది నిజంగా సులభం: అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకు, ఆయనతో మరెవ్వరినీ భాగస్వామిగా చేయకు, నమాజ్ స్థాపించు, జకాత్ ఇవ్వు, రమదాను మాసంలో ఉపవాసం పాటించు మరియు అల్లాహ్ యొక్క గృహానికి (కఅ'బా) హజ్ చేయి." తరువాత ఆయన ఇలా అన్నారు: "శుభాల (ఖైర్) యొక్క ద్వారాలను నీకు చూపించనా? ఉపవాసం ఒక కవచం, సదఖా (దానధర్మం) నీరు నిప్పును ఆర్పినట్లు పాపాన్ని ఆర్పివేస్తుంది, మరియు రాత్రి మధ్యభాగంలో ఒక వ్యక్తి చేసే (తహజ్జుద్, ఖియాముల్’లైల్) నమాజ్..." ఆ తర్వాత ఆయన ఈ ఆయత్ ను చదివారు: "{వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు} (ఖుర్ఆన్ 32:16-17) అనే వాచనం వరకు." ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: "ఈ విషయం యొక్క శిరస్సు, దాని మూలస్తంభం మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను "అవును, ఓ రసూలుల్లాహ్!" అన్నాను. అపుడు ఆయన ఇలా అన్నారు: "ఈ విషయం యొక్క శిఖరం 'ఇస్లాం', దాని మూలస్తంభం 'నమాజ్', మరియు దాని శిఖరం 'జిహాద్' (అల్లాహ్ మార్గంలో సత్యం, న్యాయం కొరకు చేసే ధర్మపోరాటం)." తరువాత ఆయన ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి మూలాధారమైన దాని గురించి నేను నీకు తెలియజేయనా?" నేను "అవును, ఓ రసూలుల్లాహ్!" అన్నాను. అప్పుడు ఆయన తన నాలుకను పట్టుకుని ఇలా అన్నారు: "దీనిని నీ ఆధీనంలో ఉంచుకో (నియంత్రించుకో)." దానికి నేను అన్నాను: "ఓ రసూలుల్లాహ్! మేము మాట్లాడే వాటికి కూడా మాపై శిక్ష విధింపబడుతుందా?" అప్పుడు ఆయన ఇలా అన్నారు: "నీ తల్లి నిన్ను కోల్పోవుగాక! ప్రజలను వారి ముఖాలపై లేదా వారి ముక్కులపై నరకంలో పడేసేది వారి నాలుకల పంట (మాటల ఫలితం) తప్ప మరొకటి ఉందా?"

[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [الأربعون النووية - 29]

వివరణ

ముఆద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఒక ప్రయాణంలో ఉన్నాను, మరియు ఒక రోజు మేము నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నేను ఆయనకు దగ్గరగా ఉన్నాను, అపుడు నేను ఇలా అడిగాను: "ఓ రసూలల్లాహ్! నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే మరియు నన్ను నరకం నుండి దూరంగా ఉంచే ఆచరణ గురించి చెప్పండి." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: "వాస్తవానికి నీవు ప్రజలు నిర్వహించడం కష్టతరమైన ఒక కార్యం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో అది వారికి చాలా సులభం మరియు తేలిక - ఇస్లాం విధిగా ఆచరించమని ఆదేశించిన వాటిని ఆచరించు."
మొదటిది: ఎవరినీ, దేనినీ ఆయనకు సాటిగా, సహవర్తిగా, భాగస్వామిగా నిలబట్టకుండా కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించు.
రెండవది: రాత్రంబవళ్ళలో విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులు ఆచరించు – ఫజ్ర్, దొహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు; వాటి నిర్ధారిత సమయాలలో, వాటికి సంబంధించిన అన్ని నియమాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఆచరించు.
మూడవది: విధి చేయబడిన జకాతును చెల్లించు. ఇది ఒక ఆర్ధిక పరమైన ఆరాధన. ఇది నిర్ణీత స్థాయికి చేరిన కొన్ని సంపదలపై షరియత్ విధి చేసిన మొత్తము. ఇది అర్హులైన వారికి ఇవ్వబడుతుంది.
నాలుగవది: రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట. ఉపవాసము అంటే ఉషోదయం నుండి మొదలుకుని, సూర్యాస్తమయం వరకు, ఆరాధనా సంకల్పముతో తినుట, త్రాగుట మరియు ఉపవాసమును భంగపరిచే ప్రతి విషయము నుండి దూరంగా ఉండుట.
ఐదవది: హజ్ యొక్క నియమాలను పాటిస్తూ, కేవలం సర్వోన్నతుడైన అల్లహ్’ను ఆరాధించే సంకల్పముతో, మక్కాహ్ నగరాన్ని దర్శించి బైతుల్లాహ్ యొక్క (అల్లాహ్ యొక్క గృహము) హజ్ చేయుట.
అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: “నేను నీకు శుభాల ద్వారాలకు దారి తీసే మార్గం గురించి తెలియజేయనా? విధిగా ఆచరించ వలసిన విషయాలతో పాటు స్వచ్ఛంద ఆరాధనలను (సున్నతు, నఫిల్) నిర్వర్తించు”.
మొదటిది: స్వచ్ఛంద ఉపవాసములు పాటించుట, ఇది వాంఛలను, కోరికలను అణచివేసి, వ్యక్తిలో శక్తిని తక్కువ చేస్తుంది, తద్వారా పాపకార్యములలో పడిపోకుండా నిరోధిస్తుంది.
రెండవది: (విధిగా చెల్లించే జకాతు కాక) స్వచ్ఛందంగా దానములు చేయుట, ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పుడు పని, పాపపు పని జరిగిపోయినట్లైతే, ఈ స్వచ్చంద దానములు దానిని తుడిచివేస్తాయి.
మూడవది: రాత్రి చివరి భాగములో ఆచరించే తహజ్జుద్ సలాహ్. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కులను పఠించినారు: {تتجافى جنوبهم } అంటే “వారు తమ ప్రక్కలను (కుడి, ఎడమ ప్రక్కలను) దూరం చేసుకుంటారు”; {عن المضاجع} “తమ మెత్తని పరుపులనుండి”; {يدعون ربهم} “తమ ప్రభువును వేడుకుంటారు” సలాహ్ ద్వారా, ఆయనను స్మరించుట ద్వారా; ఖుర్’ఆన్ పఠనం ద్వారా, మరియు దుఆ చేయుట ద్వారా; {خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ} “భయంతో మరియు ఆశతో వేడుకుంటారు; మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు; కాని వారికి, వారికర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు”; అంటే, తీర్పు దినాన మరియు స్వర్గంలో వారికి అంతిమ సౌఖ్యాన్ని అందించే ఆనందం {جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ١٧} (వారు ఆచరిస్తూ ఉండిన దానికి ప్రతిఫలంగా). (వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు).
అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: నేను నీకు ధర్మం యొక్క (దీన్ యొక్క) పునాది ఏమిటో తెలుపనా? దాని ఆధారభూతమైన మూల స్తంభము గురించి తెలుపనా? మరియు దాని శిఖరం గురించి తెలుపనా?
ము’ఆద్ (రదియల్లాహు అన్హు) “తప్పకుండా తెలుపండి ఓ రసూలల్లాహ్” అన్నారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు అల్’ఇస్లాం. ఇస్లాం అంటే రెండు విషయాలపట్ల సాక్ష్యం ఇవ్వడం (షహాదతాన్ – రెండు సాక్ష్యాలు). విశ్వాసానికి సంబంధించిన ఈ రెండు సాక్ష్యాల ద్వారా ధర్మం యొక్క సారాంశాన్ని పొందుతారు. మరియు దాని స్తంభం సలాహ్, కనుక సలాహ్ లేకుండా ఇస్లాం లేదు, ఒక ఇల్లు స్తంభం లేకుండా లేనట్లే, ఎవరైనా సలాహ్ చేస్తే, అతని ఇస్లాం (ధర్మం) మరింత బలపడుతుంది మరియు ఉన్నతమవుతుంది; దాని శిఖరం మరియు ఔన్నత్యం జిహాద్‌లో ఉంది మరియు అల్లాహ్ వాక్కును అత్యున్నతం చేయుటకుగానూ ఇస్లాం యొక్క శత్రువులతో పోరాడడంలో, కృషి చేయడంలో ఉంది.
అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: పైన పేర్కొన్న వాటిని ఏది నియంత్రిస్తుందో మరియు ఏది పరిపూర్ణం చేస్తుందో నేను నీకు చెప్పనా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని ఇలా అన్నారు: దీన్ని నియంత్రించుకో మరియు మీకు సంబంధం లేని వాటి గురించి మాట్లాడకు. అపుడు ముఆద్ ఇలా అన్నాడు: మనం మాట్లాడే దానికి మన ప్రభువు మనల్ని జవాబుదారీగా మరియు బాధ్యులుగా చేసి శిక్షిస్తాడా?!
అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన మాటను మొదలుపెట్టారు. ఇలా అనడం వాస్తవానికి శాపనార్థం కాదు. ఇది అరబీ భాషలో ఒక విధమైన వాడుక – “ఇంత చిన్న విషయం కూడా నీకు తెలియదా, నీవు దీనిని గురించి ఎప్పుడో తెలుసుకుని ఉండవలసింది” అని ఆ విషయం పట్ల అతణ్ణి హెచ్చరించడం; ఉదాహరణకు తెలుగు భాషలో “నీ మొహం మండా” అనడం లాంటిది, ఇలా అనడం తెలుగు భాషలో అతని ముఖం నిజంగానే మండాలని పెట్టే శాపనార్థం కాదు అన్న విషయం మనందరికీ తెలుసు. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మనుషుల నాలుకలు పండించే పంటలు - అవిశ్వాసం, అపనిందలు, తిట్లు, దూషణలు, చాడీలు మాట్లాడుట - ఇవి తప్ప మనుషులను మంటల్లోకి నెట్టివేసి వారి ముఖాలపై పడేలా చేసేది మరేదైనా ఉందా?”.

من فوائد الحديث

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎల్లప్పుడూ ఙ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిగా ఉండేవారు. అందుకనే ఙ్ఞానాన్ని పెంచుకునే దిశలో తమకు తెలియని విషయాలను గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరుచూ ప్రశ్నిస్తూ ఉండేవారు.
  2. ఈ హదీథులో సహాబాల యొక్క ధార్మిక అవగాహన గురించి మనకు తెలుస్తున్నది – ఎందుకంటే వారికి తెలుసు మనలను స్వర్గములో ప్రవేశింపజేసే వాటిలో మన ఆచరణలు కూడా ఒక కారణం అని.
  3. నిజానికి ముఆద్ (రదియల్లాహు అన్హు) యొక్క ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న; ఎందుకంటే అందులో ఈ జీవితము మరియు భూమిపై దాని ఉనికి యొక్క రహస్యము ఉన్నది. ఈ ప్రపంచములోని ప్రతి వ్యక్తీ ఆదము సంతానము నుండి వచ్చినవాడు, లేదా జిన్నుల సంతానము నుండి వచ్చిన వాడు. ప్రతి వ్యక్తి అంతిమ లక్ష్యము స్వర్గము లేదా నరకము.అందుకనే ఆ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న.
  4. అతని స్వర్గ ప్రవేశము ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభములను పాటించుటపై ఆధారపడి ఉన్నది : అవి, షహాదతైన్ (రెండు విషయాల పట్ల సాక్ష్యమిచ్చుట); సలాహ్ ఆచరించుట; జకాత్ చెల్లించుట; ఉపవాసములు పాటించుట మరియు హజ్జ్ యాత్ర చేయుట.
  5. అందులో ఇస్లాం ధర్మము యొక్క శిరస్సు వంటిది, అత్యంత ఉత్తమమైనది; ఇస్లాం ఆదేశించిన విధులలో సర్వోత్తమమైనది – “తౌహీద్” - కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించుట ఆయనకు సాటిగా, సమానులుగా, భాగస్వాములుగా ఎవరినీ కల్పించకుండా.
  6. అల్లాహ్ తన దాసుల పట్ల తన కరుణకు, కృపకు చిహ్నంగా వారి కొరకు శుభాల ద్వారాలను తెరిచాడు; వాటి ద్వారా తన దాసులకు గొప్ప ప్రతిఫలాన్ని పొందే మరియు పాపక్షమాపణను పొందే మార్గాలను వారికి పొందుపరుచుట కొరకు.
  7. అలాగే ఈ హదీథులో విధిగా ఆచరించవలసిన నమాజుల తరువాత స్వచ్ఛందంగా ఆచరించే నమాజుల యొక్క ఘనత తెలియుచున్నది.
  8. ఒక నివాస గృహానికి మూలస్తంభము ఎటువంటిదో, ఇస్లాం కు సలాహ్ అటువంటిది. దాని మూలస్తంభము లేకపోతే ఒక గుడారం ఎలా కూలిపోతుందో, అలాగే సలాహ్ లేకుండా ఇస్లాం లేదు.
  9. తనకు ధర్మములో నష్టము, హాని కలిగించే విషయాల నుండి నాలుకను కాపాడుకోవడం, అదుపులో పెట్టుకోవడం ప్రతి వ్యక్తికి విధి.
  10. నాలుకను నిగ్రహించడం, నియంత్రించడం మరియు అదుపులో పెట్టుకోవడం అన్ని శుభాలకు పునాది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ الأمهرية الغوجاراتية Қирғизӣ النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Кинёрвондӣ المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف Озарӣ الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా