عَنْ أَبِي سَعِيدٍ سَعْدِ بْنِ مَالِكِ بْنِ سِنَانٍ الخُدْرِيّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا ضَرَرَ وَلَا ضِرَارَ».
[حسن] - [رواه ابن ماجه، والدارقطني، وغيرهما مسندًا] - [الأربعون النووية: 32]
المزيــد ...
అబూ సయీద్ సఅద్ ఇబ్నె మాలిక్ ఇబ్నె సినాన్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
హాని చేయకూడదు మరియు ప్రతిహాని కూడా చేయకూడదు
[ప్రామాణికమైనది] - [رواه ابن ماجه والدارقطني وغيرهما مسندًا] - [الأربعون النووية - 32]
ప్రవక్త ముహమ్మద్ ﷺ స్పష్టంగా ఇలా తెలియజేశారు: హానికరమైనది ఏ రూపంలో ఉన్నా, దానిని తన కొరకు మరియు ఇతరుల కొరకు దూరంగా ఉంచడం తప్పనిసరి. ఎందుకంటే ఎవ్వరూ తమకు తాము హాని కలిగించుకోవడం గానీ, ఇతరులకు హాని కలిగించడం గానీ ధర్మసమ్మతం కాదు. ఒక వ్యక్తి నష్టానికి ప్రతీకారంగా నష్టాన్ని కలిగించడం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే న్యాయమైన ప్రతీకారం (ఖిసాస్) పద్ధతిలో తప్ప, నష్టాన్ని నష్టంతో తొలగించకూడదు. అది కూడా హక్కుల అతిక్రమణ లేకుండా మాత్రమే జరగాలి.